పశ్చిమ బెంగాల్‌లో దుర్గామాత నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనంలో పాల్గొన్న 13మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. జల్పాయ్‌గురి సమీపంలోని మాల్ నదిలో దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ఒకసారిగా వరద పోటెత్తింది. మెరుపు వరదల్లో పలువురు భక్తులు కొట్టుకుపోయారు.
ఇప్పటివరకు 13 మంది మృతదేహాలను వెలికితీశారు. 50 మందిని రక్షించామని జిల్లా మేజిస్ట్రేట్ మౌమిత గోదరా తెలిపారు. వారిలో గాయపడిన 13 మందిని దవాఖానలో చేర్చామని వెల్లడించారు.
మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారని చెప్పారు. భారీవర్షాల వల్ల మాల్ నదిలో మెరుపు వరదలు వచ్చి ఈ దుర్ఘటన చోటుచేసుకుందని తెలిపారు.