Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. పది మంది మృతి.. తొమ్మిది మంది గాయాలు

Advertiesment
road accident

సెల్వి

, శనివారం, 15 ఫిబ్రవరి 2025 (14:09 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. బోలెరో వాహనం బస్సును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. మరో 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే కుంభమేళాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
 
మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఒక బొలెరో వాహనం ఛత్తీస్‌గఢ్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళుతోంది. బస్సు మహా కుంభమేళా నుంచి వారణాసికి తిరిగి వెళుతోంది. సరిగ్గా అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం తర్వాత, సంఘటనా స్థలంలో అరుపులు, కేకలు మిన్నంటాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Gold prices falling: పడిపోతున్న బంగారం ధరలు.. రేట్లు ఎలా వుంటాయి?