Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేసవిలో హాయిగా స్విస్ కొండల్లో మంచు దుప్పటి కప్పుకుని...

వేసవి కాలం వచ్చింది. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు సెలవు రోజులు. ఈ సెలవులలో పిల్లలు ఏదో ఒక విహారయాత్రకు వెళ్లి సరదాగా గడపటానికి ఇష్టపడతారు. వారికి మంచి ఆనందాన్ని ఇవ్వాలంటే స్విట్జర్లాండ్ తప్పక చూడవలసిందే.. దాని అందం వర్ణించ శక్యము కాదు. పచ్చని పచ్చిక మైదా

వేసవిలో హాయిగా స్విస్ కొండల్లో మంచు దుప్పటి కప్పుకుని...
, బుధవారం, 9 మే 2018 (22:13 IST)
వేసవి కాలం వచ్చింది. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు సెలవు రోజులు. ఈ సెలవులలో పిల్లలు ఏదో ఒక విహారయాత్రకు వెళ్లి సరదాగా గడపటానికి ఇష్టపడతారు. వారికి మంచి ఆనందాన్ని ఇవ్వాలంటే స్విట్జర్లాండ్ తప్పక చూడవలసిందే.. దాని అందం వర్ణించ శక్యము కాదు. పచ్చని పచ్చిక మైదానాల్నీ, ఎత్తైన కొండల్నీ, లోతైన లోయల్నీ, ఉరికే జలపాతాల్నీ దాటుకుంటూ, నీలాల సరస్సులో విహరిస్తూ, గాలి కెరటాల్లో తేలియాడుతూ, తెల్లని మేఘాల పరదాల్ని చీల్చుకుంటూ, చల్లని మంచు కొండల మీద చట్టా పట్టాలేసుకొని చక్కర్లు కొట్టాలనుకునే వాళ్లు భూతలస్వర్గంగా పిలిచే స్విట్జర్లాండ్‌ను ఒక్కసారైనా సందర్శించాల్సిందే. 
 
ఇక్కడ ఉన్న రైనె జలపాతం 75 అడుగుల ఎత్తు, 450 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది. ఈ జలపాతానికి దగ్గరలో న్యూహసన్ గుహలు ఉన్నాయి. ఈ జలపాతం కిందకి దూకి నదిగా మారే ప్రదేశం మధ్యలో రైనేఫాల్ ఫెల్సిన్ అనే పెద్ద బండరాయి ఉంది. ఇది లక్షల సంవత్సాల నాటిదిగా చెబుతారు. జలపాతం దిగువ నుంచి మలుపు తీసుకొని, కొండల మీదుగా జలపాతం పైకి రైల్లో ప్రయాణిస్తూ ఆ రైనే జలపాత అందాల్నిచూడటం మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. 
 
స్విట్జర్లాండ్ దేశంలోని ముఖ్య బ్యాంకులూ పరిశోధన కేంద్రాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. జ్యూరిచ్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ప్రాంతమే నగరానికి ప్రధాన వ్యాపార కూడలి. జ్యూరిచ్ కళల మ్యూజియం, బొటానికల్ ఉద్యానవనమూ, ఫిపా ప్రపంచ పుట్ బాల్ మ్యూజియమూ, ప్రార్ధనా మందిరాలు... ఇలా చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి.
 
స్విట్జర్లాండ్‌లో మరో చూడదగ్గ ప్రదేశం ప్రాన్‌మున్ టెగ్ నది. దీని మధ్యలో ఓ విడిది ప్రదేశం ఉంది. ఒక వైపు ఎత్తైన కొండ, మరోవైపు లోతైన లోయ, మూడో వైపుకి చూస్తే ల్యూసెర్న్ సరస్సుతో కూడిన సుందర ప్రదేశం ఉంది. ఇది రకరకాల రెస్టారెంటులతో చాలా అందంగా ఉంటుంది. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రత ఐదారు డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉండదు. వేసవిలో తప్ప మిగిలిన సమయాల్లో ఇక్కడ మెుత్తం మంచుతో నిండిపోయి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్.గోపాల్ రెడ్డి తనయుడు సమస్య ఏంటో విశాల్‌కు తెలుసా? ఏడుస్తూ ట్వీట్ పెట్టాడు