Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Maha Shivaratri:12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే..?

Maha Shivaratri:12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే..?
, మంగళవారం, 1 మార్చి 2022 (10:06 IST)
జోతిర్లింగము అంటే లింగం రూపంలో శివుడిని ఆరాధించే ప్రదేశం. 12 జ్యోతిర్లింగాలు లేదా శివలింగాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 12 జ్యోతిర్లింగాలను ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలుస్తారు. జీవితంలో మొత్తం జ్యోతిర్లింగాలను సందర్శిస్తే శివుని పాదాల వద్ద మోక్షాన్ని సాధిస్తారు. 
 
సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్ 
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్ 
ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్ 
సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే 
వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే 
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే 
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః 
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. 
 
ఈ ద్వాదశ జ్యోతిర్లింగం శ్లోకాన్ని పఠిస్తే ఏడేడు జన్మలలో చేసిన పాపాలు అన్ని పోతాయని భక్తుల నమ్మకం.
 
ఒక నమ్మకం ప్రకారం శివుడు ఉత్తరా నక్షత్రాన ఒక రాత్రి ఈ భూమిపై అవతరించారని శివపురాణం చెప్తోంది. జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికి వాటిలో 12 మాత్రమే ప్రాముఖ్యతను పొందాయి. 
 
12 జ్యోతిర్లింగాలు... వాటి విశేషాలు
 
1. సోమ‌నాధ జోతిర్లింగం - గుజ‌రాత్ రాష్ట్రం  
2. శ్రీ‌శైలం మ‌ల్లికార్జున స్వామి జోతిర్లింగం - ఆంధ్ర‌ప్ర‌దేశ్
3. మ‌హాకాళేశ్వ‌ర్ జోతిర్లింగం - మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉజ్జయినీ 
4. ఓంకారేశ్వర్ జోతిర్లింగం - మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో న‌ర్మ‌దా న‌ది ద్వీపం 
5. వైద్యనాథ్ జోతిర్లింగం - మహరాష్ట్ర  
6. శ్రీనాగనాథేశ్వర జోతిర్లింగం - మహారాష్ట్ర 
7. రామేశ్వ‌ర జ్యోతిర్లింగం - తమిళనాడు 
8.  కేదార్నాథ్ జోతిర్లింగం - ఉత్త‌రాంచల్ 
9. ట్రింబ‌కేశ్వర్ జోతిర్లింగం - మ‌హారాష్ట్ర నాసిక్  
10. భీమశంకర్ జోతిర్లింగం - మ‌హారాష్ట్ర 
11. శ్రీ ఘృష్ణేశ్వర జోతిర్లింగం - మ‌హారాష్ట్ర ఔరంగ‌బాద్  
12. విశ్వేశర జోతిర్లింగం-వారణాసి - ఉత్తర్ ప్రదేశ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-03-2022 మంగళవారం దినఫలాలు - ఈశ్వరునికి అభిషేకం చేయించిన...