Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా హృదయం నీ మందిరము

Advertiesment
నా హృదయం నీ మందిరము
, మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (17:34 IST)
నా హృదయమె నీ మందిరము!
నీ సన్నిధియే సుందరము!!
నా భావము నీ స్పందనము!
నీకిదే దాసుని వందనము
 
నీకే అంకితము జీవనము!
నిన్నెంచుటచే పావనము!!
నీ ఆరాధన నా ధనము!
లక్ష్యసిద్ధి కదె సాధనము!!
 
అగాధమీ భవసాగరము!
కాదు ఈదగా, నా తరము!!
నా బుద్ధి సదా చంచలము!
నడిపించుట నీ కైవసము!!
 
నీ సంకేతమె నాదు మార్గము!
నీ సంగీతమె నాదు స్వర్గము!!
నా సంతోషము నీ వరదానము!
నాకానందము నీ దర్శనము!!!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేరేడు పండు వల్ల కలిగే ప్రయోజనాలు