Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవే నా చివరి ఎన్నికలంటున్న సుశీల్ కుమార్ షిండే

Advertiesment
ఇవే నా చివరి ఎన్నికలంటున్న సుశీల్ కుమార్ షిండే
, గురువారం, 4 ఏప్రియల్ 2019 (12:13 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కీలక ప్రకటన చేశారు. 17వ సార్వత్రిక ఎన్నికలే తన చివరి ఎన్నికలని, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయబోనని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతలు ఇప్పటికే పలు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి పాలనలో పాలుపంచుకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని షోలాపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి సుశీల్ కుమార్ పోటీ చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ, "ఇవే నా చివరి ఎన్నికలని ఇక ఎన్నికల్లో పోటీ చేయను" అని స్పష్టం చేశారు. అయితే, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలని తెలిపారు. కాగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో షిండే బీజేపీ నేత జైసిద్దేశ్వర్‌ స్వామి, అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌తో పోటీ పడుతున్నారు. 
 
మరోవైపు, షిండే.. 1970ల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన షిండే.. 1974లో షోలాపూర్‌ జిల్లాలోని కర్మాలా అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేశారు. ఆనాటి సీఎం వసంతరావ్‌ నాయక్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 1978లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన షిండే.. శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌లో చేరారు. అనంతరం కొంత కాలానికే తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 2003లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గానూ పనిచేశారు. గత యూపీఏ ప్రభుత్వ హాయంలో కేంద్ర హో శాఖామంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్వే చెప్పేసింది.... ఏపీకి జగనే సీఎం..?!! క్లీన్ స్వీప్ చేయడం ఖాయం..?