ఈవీఎం బాక్సులను రూమ్‌కు మోసిన కలెక్టర్

ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (10:19 IST)
ఆమె ఒక కలెక్టర్. నిల్చొని పని చేయించాల్సిన అధికారిణి. కానీ, సిబ్బంది తక్కువగా ఉండటంతో ఆమె కూడా ఎన్నికల సిబ్బంది అవతారమెత్తారు. ఈవీఎం బాక్సులను మోసారు. సాటి సిబ్బంది శ్రమను తాను కూడా పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాల వైరల్ అవుతోంది. 
 
ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని కూర్కెంచి జిల్లాలో జరుగుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే, దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. కేరళలో పోలింగ్ కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
అయితే, కూర్కెంచి జిల్లాలో కలెక్టర్ అనుపమ త్రిశూర్ పట్టణంలో ఎన్నికల విధుల నిర్వహణకు వచ్చింది. ఓ పక్క లారీలో బాక్స్‌లు కిందకి దించుతున్నారు. వాటిని దించేందుకు సిబ్బంది తక్కువగా ఉండటంతో పని త్వరగా జరగాలనే ఉద్దేశ్యంతో కలెక్టర్ అనుపమ ఓ చేయి వేశారు. 
 
ఓటింగ్ మెషీన్‌లు ఉన్న బ్యాక్సులు కూడా మోసుకెళుతున్న వీడియోను అక్కడే ఉన్నవారు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. క్షణాల్లో అది వైరల్‌గా మారిపోయింది. పబ్లిక్‌కు ఆమె అందిస్తున్న సేవలు, సింప్లిసిటీకి వేల కొద్ది కామెంట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రెండురోజులు పోతే జగన్ అది చేతిలో పట్టుకుని తిరుగుతాడు: చంద్రబాబు