Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షియోమీ ఎంఐ 10 ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌... 3వేల రూపాయల క్యాష్ బ్యాక్

Advertiesment
షియోమీ ఎంఐ 10 ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌... 3వేల రూపాయల క్యాష్ బ్యాక్
, శుక్రవారం, 8 మే 2020 (13:39 IST)
Xiaomi Mi 10
షియోమీ నుంచి ఎంఐ 10 ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదలైంది. షియోమీ ఎంఐ 10 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ముందస్తు ఆర్డర్లు ఈ రోజు (మే 8) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. ఎంఐ10ను ప్రీ-బుకింగ్ చేసే వినియోగదారులందరికీ రూ. 2499 విలువ చేసే ఎంఐ వైర్‌లెస్‌ పవర్‌ బ్యాంక్‌ను ఉచితంగా ఇవ్వనుంది. 
 
అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసేవారు రూ.3వేల వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. ఎంఐ డాట్‌కామ్‌, అమెజాన్‌ ఇండియా వెబ్‌సైట్ల ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్లు కొనుగోలు చేయొచ్చు.
 
రూ.49,999 ప్రారంభ ధరతో కొత్త మోడల్‌ను సంస్థ భారత్‌లో విడుదల చేసింది. 108 మెగా పిక్సల్‌ ప్రైమరీ కెమెరా కలిగి ఉండటం ఈఫోన్‌ ప్రత్యేకత. 8K వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్ట్‌ చేస్తుంది. 
 
ఫీచర్స్ సంగతికి వస్తే..
8 జీబీ రామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్‌: ధర: 49,999
8 జీబీ రామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్‌: ధర: 54,999
క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 865

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైజాగ్ గ్యాస్ లీక్ : విగత జీవులుగా పడిపోయిన మూగజీవులు