Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోసం నివారణ కోసం ఫీచర్స్‌ అప్‎గ్రేడ్ చేసిన ట్రూకాలర్

True caller
, గురువారం, 21 సెప్టెంబరు 2023 (22:12 IST)
ట్రూకాలర్ ఈరోజు గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ పై తక్షణం గుర్తించబడే ఒక కార్పొరేట్ రీబ్రాండింగ్, ఒక కొత్త యాప్ ఐనాన్ ప్రారంభాన్ని ప్రకటించింది. కొత్త బ్రాండ్ గుర్తింపు సమయం డిజిటల్ స్పేస్‌లో జరుగుతున్న ముఖ్యమైన పరివర్తనతో సమలేఖనం అవుతుంది. ట్రూకాలర్ పునరుద్ధరించబడిన ఉద్దేశము, శక్తి మరియు ఉత్సాహం ఈ రీబ్రాండింగ్ యొక్క ముఖ్యాంశములు.
 
ప్రకటన గురించి వ్యాఖ్యానిస్తూ, అలాన్ మామెడి, సహ-వ్యవస్థాపకులు మరియు సీఈఓ, ట్రూకాలర్ ఇలా అన్నారు, “మా కొత్త బ్రాండ్ గుర్తింపును, లోగోను ఆవిష్కరించుటకు మాకెంతో సంతోషంగా ఉంది. ఇది మా యూజర్ల పట్ల మాకు ఉన్న అంకితభావం, ప్రతిరోజు నిరంతరంగా అభివృద్ధి మరియు మెరుగుపరచడానికి దృష్టి కేంద్రీకరించడాన్ని సూచిస్తుంది.” “అందరికి కమ్యూనికేషన్‌ని రక్షించాలనే మా మిషన్, సెర్చ్ కాంటెక్స్ట్ మరియు యూజర్ గోప్యతను మెరుగుపరచుటకు ఇంజనీర్ మెరుగుదలల వంటి ఈ కొత్త మోసం-వ్యతిరేకమైన పరిష్కారాలను అభివృద్ధి చేయుటకు మార్గదర్శనం చేస్తుంది.” అని ఆయన చెప్పారు.
 
ఈ రిఫ్రెష్ చేయబడిన గుర్తింపులో ఒక భాగముగా, ట్రూకాలర్ ఏఐ ఐడెంటిటి ఇంజన్లో భాగంగా, ట్రూకాలర్ యూజర్లు సెర్చ్ కాంటెక్స్ట్ అనే ఒక శక్తివంతమైన మోసం-వ్యతిరేకమైన ఫీచర్‌ను పొందుతారు. ఏ నంబరుకైనా సెర్చ్ ఫలితాలను చూడగానే, ట్రూకాలర్ యూజర్లు తక్షణమే ఆ నంబరు కొరకు ఉన్న పేరు ఇటీవల మార్చబడిందా లేదా తరచూ మార్చబడుతోందా అని సూచించబడతారు. ఈ సందర్భోచితమైన సందేశాన్ని ఈ యాప్ మూడు రంగుల వర్గాలుగా విభజిస్తుంది: నీలం, ఒక తటస్థ మార్పు కొరకు, పసుపుపచ్చ, గత 7 రోజులలో ఆ పేరు 3 కంటే ఎక్కువమార్లు మార్చబడి ఉంటే అది అనుమానాస్పదమైనదాని కొరకు, చివరిగా ఎరుపురంగు, అనేకమార్లు మరియు తరచూ పేరు మార్పును మరియు మోసపూరితమైన మరియు స్కామర్ కార్యకలాపాన్ని సూచిస్తుంది. ఈ సందేశము ఆండ్రాయిడ్, ఐఫోన్ మరియు ట్రూకాలర్ వెబ్ లలో అన్ని సెర్చ్ ఫలితాలపై ట్రూకాలర్ యూజర్లు అందరికి చూపించబడుతుంది.
 
కొత్త బ్రాండింగ్ గుర్తింపు ప్రముఖ ప్రపంచవ్యాప్త బ్రాండ్ కన్సల్టెన్సీ, ఇంటర్ బ్రాండ్‎ల కూర్పు, ఇది రాబోయే వారాలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడుతుంది. కొత్త యాప్ ఐకాన్, మార్పులను చూసేందుకు, యూజర్లు ఆండ్రాయిడ్ పై యాప్ వర్షన్ 13.34 లేదా అంతకంటే కొత్తదానికి మరియు ఐఓఎస్ పై వర్షన్ 12058 లేదా అంతకంటే కొత్తదానికి అప్డేట్ చేయవలసి ఉంటుంది

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వజ్రం దొరికింది.. కానీ రైతు చిక్కుల్లో పడ్డాడు..