Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేధింపులు, కుంభకోణాల నుంచి కాపాడేందుకు తన నిబద్ధతను పునరుద్ఘాటించిన ట్రూకాలర్‌

true caller
, శుక్రవారం, 14 అక్టోబరు 2022 (21:42 IST)
ప్రపంచంలోనే ప్రముఖ కమ్యూనికేషన్స్‌ వేదికగా నిలుస్తున్న ట్రూకాలర్‌ ఒక ముఖ్యమైన సందేశాన్ని తెలియజేయడానికి సరికొత్త ప్రచారాన్నిఈ రోజు ప్రారంభించింది. ట్రూకాలర్, ది వోంబ్ రూపొందించిన ఈ ప్రచారం భారతదేశమూ, దాని ప్రజల నిజమైన స్వభావాన్ని వర్ణిస్తుంది. రెండు పేర్లు ఒక గుర్తింపుతో కూడిన మన సువిశాలమైన భారతదేశంలోనే అనేక మినీ ఇండియాలు ఉన్నాయి. నగరాల్లో నివసించే వారికే కాదు భారతదేశంలోని చిన్న పట్టణాల్లో ఉండేవారికి కూడా స్మార్ట్‌ ఫోన్‌ అంతే ప్రధానమైన సాధనమనే విషయం మాకు తెలుసు. కాబట్టి ప్రతీ ఒక్కరూ అవాంఛిత కమ్యూనికేషన్స్‌ ముప్పు నుంచి రక్షణ పొందాలి.
 
ఎర్ర రంగుతో కూడిన ఈ చిత్రాలు ప్రేక్షకులపై చెరిగిపోని ముద్ర వేస్తాయి. స్కామ్/వేధింపు కాల్స్‌ను సూచించడానికి ఎరుపు రంగు ఉపయోగించినప్పుడు ఆ  సందేశం సహజంగానే ప్రభావం చూపుతుంది. 'బురి నజర్ వాలే తేరా ముహ్ కాలా' అన్న సామెతతో దీన్ని పోల్చవచ్చు. ఆన్‌లైన్ కమ్యూనికేషన్ ప్రపంచంలో సురక్షిత ప్రదేశాన్ని సృష్టించడం ఈ ప్రచార లక్ష్యం.
 
స్పామ్, స్కామ్  ఆన్‌లైన్ మోసాల నుంచి వినియోగదారులను దూరంగా ఉంచి వారికి సాయపడాలనే తపనలో భాగంగా ట్రూకాలర్‌ ప్రచారాల రూపంలో అనేక కార్యక్రమాలు చేపడుతోంది. భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ సైబర్‌ సేఫ్టీ శిక్షణ ద్వారా యువతలో అవగాహన కల్పిస్తోంది. అవాంఛిత/అవాంఛనీయ దృష్టి లేదా OTP, లాటరీ మోసాలు సహ వేధింపులు ఏ రూపంలో ఉన్నా వాటిని ఎదుర్కొనేందుకు ప్రజలకు సాయపడటంలో ట్రూకాలర్‌ కీలకపాత్ర పోషిస్తోంది.
 
ప్రచార చిత్రాల గురించి ట్రూకాలర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కరి కృష్ణమూర్తి మాట్లాడుతూ, “మనం ఆచరించే పద్ధతులు, సంప్రదాయాలన్నీ కూడా మన బలమైన నమ్మకాలకు ప్రతీకలు కాబట్టే భారతీయ సంస్కృతి బలంగా వేళ్లూనుకొనిపోయింది. ఈ ప్రచారం ద్వారా మేము వేధింపులు/స్కామ్‌ల రూపంలో ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యను దిగ్బంధం చేయడమే కాకుండా సమాజం నుంచి అందే సామూహిక  ఫీడ్‌బ్యాక్‌ను బట్టి స్పామ్ మార్కింగ్‌ ద్వారా అటువంటి మోసపూరిత కాల్స్‌ ఎరుపు రంగులో కనిపించేలా చేయడానికి ప్రయత్నించాం. అవాంఛిత కమ్యూనికేషన్‌కు వ్యతిరేకంగా రక్షణ రేఖను రూపొందించడంలో ఈ అర్థవంతమైన చిత్రాలు సాయపడగలవని మేము భావిస్తున్నాం” అన్నారు.
 
ప్రచారం వెనుక ఉన్న ఆలోచనను ది వూంబ్ సహ-వ్యవస్థాపకుడు నవీన్ తల్రేజా వివరిస్తూ, “భారతదేశంలో 7 ఏళ్లుగా పనిచేస్తున్న ట్రూకాల్‌  స్మార్ట్‌ఫోన్లు సురక్షితంగా ఉండేలా ముఖ్యంగా స్త్రీలు, పెద్దవారిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ గణనీయమైన కృషి చేస్తోంది. చిన్న పట్టణాలుగా అభివర్ణించే 'భారత్'లోని వినియోగదారులతో మాట్లాడిన మా బృందం, అక్కడి వారికి ఈ ఉత్పత్తి ఎంతో అవసరమనే గుర్తించడంతో పాటు దానికి సంబంధించిన అవగాహన, అన్వేషణ చాలా పరిమితంగా ఉందని గ్రహించింది. మేము చేయాల్సిన పనులను ఈ విషయాలు మాకు తెలియజెప్పాయి. అందుకే అతి సరళమైన రూపంలో భారత్‌ కోసం ట్రూకాలర్‌ అందిస్తున్నాం. వ్యక్తిగత వినియోగదారుతో పాటు సమాజానికి ఈ ఉత్పత్తి ప్రయోజనం చేకూరుస్తుంది. ఒక ఉద్యమాన్ని ప్రారంభించి భారతదేశంలోని పెద్ద సంఖ్యలోని ప్రజలను ఒకరి నుంచి మరొకరు రక్షించుకునేలా చూడటం ఈ ప్రచారం ఉద్దేశం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేడి వేడి ఇడ్లీలు కావాలా? ఐతే ఇడ్లీ ఏటీఎం వచ్చేసిందిగా! చట్నీతో పాటు..?