ఎమ్ఐ నుంచి సీసీ9 సిరీస్‌ ప్రో.. నవంబర్ ఐదో తేదీన చైనాలో రిలీజ్

మంగళవారం, 29 అక్టోబరు 2019 (17:15 IST)
ఎమ్ఐ సీసీ9 సిరీస్‌కు మరో స్మార్ట్‌ఫోన్ వచ్చే అవకాశం వుంది. ఎమ్ఐ సీసీ9, ఎమ్ఐ సీసీ9ఈ తర్వాత ఈ సిరీస్‌లో చేరేందుకు మూడో స్మార్ట్ ఫోన్ ఎమ్ఐ సీసీ 9 ప్రో వచ్చేస్తోంది. ఎమ్ఐ సీసీ9 ప్రో నవంబర్ ఐదో తేదీన చైనాలో ఆవిష్కరించబడుతోంది. 
 
ఈ మేరకు చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ట్విట్టర్‌లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఫీచర్ గల ఎమ్‌ఐ సీసీ9 ప్రోను ట్యాగ్ చేశారు. కొత్తగా రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలోనే మొట్టమొదటి 108 మెగాపిక్సెల్ పెంటా-కెమెరా సెటప్‌గా ఉంది. పెంటా-కెమెరా సెటప్‌తో చైనాలో ఇప్పటికే ఎమ్ఐ సీసీ9 ప్రోను ప్రారంభించటానికి షియోమీ సన్నాహాలు చేసింది. 
 
ఫీచర్స్ సంగతికి వస్తే..?
స్మార్ట్‌ఫోన్‌లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 
మాక్రో సెన్సార్, డెప్త్ సెన్సార్‌తో అమర్చిన కెమెరాలు 
ఐదో కెమెరా సెన్సార్ 5x ఆప్టికల్ జూమ్ వరకు షూట్ చేయగల టెలిఫోటో షూటర్ ఇందులో వుంటాయని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బురిడీ లెక్కలు వద్దు... ఆర్టీసీకి రూ.47 కోట్లు ఇవ్వలేరా : కేసీఆర్ సర్కారుకు హైకోర్టు ప్రశ్న