కొత్త ప్రైవసీ పాలసీతో వాట్సాప్ షాకిస్తున్నారు వినియోగదారులు. సిగ్నల్, టెలిగ్రామ్ డౌన్లోడ్స్ పెరిగాయి. టెలిగ్రామ్ కొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులను మరింత మందిని చేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వాయిస్ ఛాట్ సపోర్ట్‌ను యాడ్ చేసింది. ఈ వాయిస్ సపోర్ట్ క్లబ్‌హౌస్ యాప్‌లోని వాయిస్ చాట్ మాదిరిగానే పనిచేస్తుంది.
ఇక, టెలిగ్రామ్ తన ఛానెల్స్‌లో వాయిస్ చాట్ సపోర్ట్‌ను యాడ్ చేసింది. వాయిస్ చాట్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపర్చడం కోసం ఈ ఫీచర్ణు అందుబాటులోకి తెచ్చింది. వాయిస్ చాట్‌లతో యూజర్లు తమ స్నేహితులతో సులభంగా ఇంటరాక్ట్ కావొచ్చు. ఆయా గ్రూప్స్‌లో ఛానెల్ నిర్వాహకులు అవసరాన్ని బట్టి నిర్దిష్ట తేదీ, సమయంలో వాయిస్ చాట్‌ను షెడ్యూల్ చేయవచ్చు.
అంతేకాక, ఈ వాయిస్ చాట్‌లకు మరిన్ని అదనపు ఫీచర్లను జోడించడానికి కొత్త అప్డేట్ను ప్రకటించింది. క్రొత్త అప్డేట్ ప్రకారం అన్ని టెలిగ్రామ్ చాట్‌ల కోసం పేమెంట్ ఫీచర్‌ను యాడ్ చేసింది.
అంతేకాక, వాయిస్ చాట్‌ల కోసం షెడ్యూలింగ్, మినీ ప్రొఫైల్‌లను అందుబాటులోకి తెచ్చింది. క్రొత్త అప్డేట్ ప్రకారం ఏదైనా చాట్‌లోని మెసేజెస్ను, ఇన్వైట్ లింక్స్‌ను టైమర్ సెట్ చేసుకొని ఆటో-డిలీట్ చేసుకోవచ్చు. తద్వారా, వేగంగా చాట్ చేసుకునే అవకాశం కలుగుతుంది.