2జీ, 3జీ, 4జీలంటూ ఇంటర్నెట్ సేవలు వచ్చేసిన నేపథ్యంలో.. దేశంలో తొలిసారిగా 5జీతో కూడిన స్మార్ట్ ఫోన్ విడుదలైంది. 2020వ సంవత్సరంలో 5జీ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ ఫోన్‌ను తొలిసారిగా భారత్‌లో మొబైల్స్ తయారీదారు రియల్‌మి సంస్థ విడుదల చేసింది. తన నూతన ఫ్లాగ్‌షిప్ 5జీ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి ఎక్స్50 ప్రొ 5జీని ఇవాళ భారత్‌లో విడుదల చేసింది. రియల్‌మికి చెందిన మొదటి 5జీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం.
ఈ ఫోన్‌లో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. దీంతో కేవలం 0.27 సెకన్ల వ్యవధిలోనే ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు. అలాగే 65 వాట్ల సూపర్ డార్ట్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. దీని సహాయంతో కేవలం 35 నిమిషాల్లోనే ఫోన్‌ను 0 నుంచి 100 శాతం వరకు చార్జింగ్ చేసుకోవచ్చు.
ఫీచర్స్ సంగతికి వస్తే..?
6.44 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేకు 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్
ముందు భాగంలో 32 మెగాపిక్సల్ పంచ్ హోల్ కెమెరా
స్నాప్‌డ్రాగన్ 865 అధునాతన ప్రాసెసర్, 12 జీబీ వరకు ర్యామ్, కూలింగ్ టెక్నాలజీ,
64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా
12 మెగాపిక్సల్ టెలిఫొటో లెన్స్
2 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న డెప్త్ సెన్సార్
ఫోన్ వెనుక భాగంలో 3డీ ఏజీ గ్లాస్ బ్యాక్
దీనికి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది.
దీని ధర రూ. 37,999 నుంచి ప్రారంభం అవుతుందని రియల్ మి ప్రకటించింది.