భారత్‌లో విడుదల కానున్న అసుస్ జెన్‌ఫోన్ 6

సోమవారం, 20 మే 2019 (18:44 IST)
ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ అసుస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ జెన్‌ఫోన్ 6 ను త్వ‌ర‌లో భార‌త్‌లో విడుద‌ల చేయ‌నుంది. గ‌త వారం స్పెయిన్‌లో ఈ ఫోన్ విడుద‌ల కాగా త్వ‌ర‌లో భార‌త్‌లోనూ ఈ ఫోన్‌ను లాంచ్ చేయ‌నున్నారు. రూ.39,132 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందించనున్నారు. 
 
అసుస్ జెన్‌ఫోన్ 6 ప్రత్యేకతలు...
* 6.46 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 
* గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 
* 6/8 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, 
* 1టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 
 
* డ్యుయ‌ల్ సిమ్‌, 48, 13 మెగాపిక్స‌ెల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 
* యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలదు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం గాలిస్తున్న పోలీసులు... ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాష్ పాట్లు