Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్కెట్‌లోకి జిక్సర్ మోడల్ బైక్‌లు.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Advertiesment
Suzuki Gixxer SF 250
, సోమవారం, 20 మే 2019 (17:01 IST)
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ దిగ్గజ సంస్థ సుజుకీ భారత మార్కెట్లోకి కొత్త జిక్సర్ మోడల్ బైక్‌లను విడుదల చేసింది. భారత్‌లో ఈ బైక్‌లు పాపులర్ కావడంతో కంపెనీ ఇంతకుముందు కూడా ఈ సెగ్మెంట్ బైక్‌లను విడుదల చేసింది. 2019 మోడల్ సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 ఏబీఎస్ ప్రారంభ ధరను రూ.1.70 లక్షలుగా నిర్ణయించారు. దీంతో పాటే సుజుకీ సంస్థ జిక్సర్ 150 ఎస్ఎఫ్‌ని కూడా ప్రారంభించి, దీని ప్రారంభ ధరను రూ.1,09,800 గా నిర్ణయించింది.
 
జిక్సర్ ఎస్ఎఫ్ 250 మోడల్‌లో ఆయిల్ కూల్డ్ 249 సీసీతో ఒకే సిలిండర్ ఇంజన్‌తో అందించబడింది. ఈ ఇంజన్ 26 బీహెచ్‌పి శక్తితో నడుస్తుంది. ఈ బైక్ ఆరు గేర్‌లతో, ఎల్ఈడీ హెడ్ లైట్స్‌తో, స్ప్లిట్ సీట్స్, 17 అంగుళాల మల్టీ స్పోక్ అలాయ్ వీల్స్‌తో అందించబడింది. ఈ బైక్‌లో డ్యుయల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ మరో విశేషం. జిక్సర్ ఎస్ఎఫ్ 250లో టెలీస్కోపిక్ ఫోర్క్స్ ఉండగా, ఇవి ముందువైపు ఉంటాయి. వెనుకవైపు మోనోషాక్ ఉంటుంది. ఈ బైక్‌లో డ్యుయల్ ఛానెల్ ఏబీఎస్ ఇవ్వబడింది.
 
2019 సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 రియర్, ఫ్రంట్‌లో డిస్క్ బ్రేకులు ఉన్నాయి, 250 సీసీకి చెందిన ఈ బైక్ చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. భారత్‌లో ఈ బైక్ యమహా ఫేజర్ 25, హోండా సీబీఆర్, బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200, కెటిఎం ఆర్సీ 200 వంటి బైకులతో పోటీ పడనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎయిర్‌టెల్