Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

razr 40 అల్ట్రా, razr 40ని ఆవిష్కరించిన మోటరోలా

image
, సోమవారం, 10 జులై 2023 (17:17 IST)
భారతదేశపు అత్యుత్తమ 5G స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్, ఫ్లిప్ ఫోన్‌ల మార్గదర్శి అయిన మోటరోలా తన ఫ్లాగ్‌షిప్ రేజర్ స్మార్ట్‌ ఫోన్‌ల సిరీస్‌లో సరికొత్త జోడింపులు మోటోరోలా రేజర్ 40 అల్ట్రా, రేజర్ 40 ఆవిష్కరణతో ఈరోజు మళ్లీ భారతీయ స్మార్ట్‌ ఫోన్ మార్కెట్‌లో సంచలనం కలిగించింది. ఈ ఆవిష్కరణ ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్‌ల తీరు తెన్నులను ఫ్లిప్ చేయడానికి అత్యాధునిక సాంకేతికత, స్టైల్-డ్రైవెన్ సెల్ఫ్ ఎక్స్‌ ప్రెషన్‌లతో కూడిన ఐకానిక్ రేజర్‌ను తిరిగి తీసుకువస్తుంది. ఈ కొత్త కుటుంబంలోని ప్రతి ఫీచర్ ప్రత్యేకించి నిలబడాలనుకునే, ఆధునిక ఫ్లిప్ ఫోన్ ఉత్తమ సంస్కరణను కోరుకునే ఆధునిక వినియోగదారుల అవసరాలను తీర్చడానికి జాగ్రత్తగా రూపొందించబడింది. మోటరోలా ఈ రోజు నగరంలో జరిగిన లాంచ్ ఈవెంట్‌లో భారతదేశపు ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్‌ను తన కొత్త ప్రచారకర్తగా ప్రకటించింది.
 
ప్యాక్‌లో ముందంజలో ఉన్నది razr 40 అల్ట్రా. ఇది  ఫ్లిప్ క్లోజ్ చేసిన సమయంలో యావత్ పరిశ్రమలోనే చాలా సన్నని ఫ్లిప్ స్మార్ట్‌ ఫోన్. శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ 8+ Gen 1 మొబైల్ ప్లాట్‌ఫామ్, సమర్థవంతమైన బ్యాటరీ, ఫ్లిప్ ఫోన్‌లో అతిపెద్ద ఎక్స్టర్నల్ డిస్‌ప్లే. ఈ నమ్మశక్యం కాని అద్భుతమైన  ఎక్స్ టర్నల్ డిస్‌ప్లే ఆశ్చర్యపరిచే 3.6” పోలెడ్ స్క్రీ న్‌తో వస్తుంది. ఇది మూసివేయబడినప్పుడు కూడా బహుళ యాప్‌లు, ఫంక్షన్‌లను పూర్తిగా సపోర్ట్ చేయగలదు. కా బట్టి వినియోగదారులు ఒక్కచూపులో మరిన్నింటినో వీక్షించవచ్చు. అత్యంత ముఖ్యమైన కంటెంట్‌ని యాక్సెస్ చేయవచ్చు. వినియోగదారులు సందేశాలకు స్పందించవచ్చు, సెల్ఫీ తీసుకోవచ్చు, డైరెక్షన్స్ పొందవచ్చు, గేమ్‌లు ఆడవచ్చు, Spotifyలో సంగీతాన్ని వినవచ్చు. ఈ పెద్ద ఎక్స్ టర్నల్ డిస్‌ప్లేలో యూట్యూబ్‌ని వీక్షించి ఆనందించవచ్చు. అంతేకాకుండా, ఈ ఎక్స్టర్నల్ డిస్‌ప్లే 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో సున్నితంగా ఉంటుంది. యాప్‌లు, స్క్రోలింగ్, వెబ్‌సైట్‌ల మధ్య మారడాన్ని తిరుగులేని విధంగా చేస్తుంది.
 
ఈ ఎక్స్‌‌టర్నల్ డిస్‌ప్లే 1100నిట్‌ల గరిష్ట ప్రకాశంతో వస్తుంది కాబట్టి అవుట్‌డోర్‌లో కూడా స్పష్టమైన స్క్రీన్ విజిబిలిటీ ని కలిగి ఉంటుంది. అలాగే, ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుంది. ఇది సాధారణ వినియోగానికి మన్నికను అందిస్తుంది. అంతేకాకుండా, ఎక్స్టర్నల్ డిస్‌ప్లే దీని తరగతిలో అత్యధిక రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. 10బిట్ మరియు 100% DCI-P3 ఫీచర్‌ల ద్వారా ఒక బిలియన్ షేడ్స్ ట్రూ-టు-లైఫ్ రంగులతో ఇది వీక్షణ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పెద్ద ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లే కంటెంట్ క్రియేషన్ నుండి మేకప్ అప్లై చేయడం లేదా మీరు సెల్ఫీ తీసుకునే ముందు త్వరగా పరిశీలించడం దాకా వినియోగదారుల కోసం అనేక రకాల వినియోగ సంద ర్భాలను అందిస్తుంది,
 
అంతేకాదు, మోటోరోలా razr 40 అల్ట్రా స్మార్ట్‌ ఫోన్‌ను తెరిచినప్పుడు ఇది దాదాపు క్రీజ్‌లెస్, అల్ట్రా-స్మూత్ డిస్‌ప్లేను అందిస్తుంది. ఇది 6.9" pOLED స్క్రీన్ అత్యధిక స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 165Hz మరియు 1400nits గరిష్ట ప్రకాశంతో పూర్తిగా తెరిచినప్పుడు కూడా స్మార్ట్‌ ఫోన్ అనుభవం వినియోగదారులకు మరింత మెరుగ్గా ఉండేలా చేస్తుంది. మోటొ రోలా razr40, 144Hz వద్ద రిఫ్రెష్ రేట్ పీక్స్‌‌తో సారూప్య డిస్‌ప్లే కాన్ఫిగరేషన్‌తో వస్తుంది, ఇది దీన్ని చాలా మృదువైనదిగా కూడా చేస్తుంది.
 
డిజైన్ పరంగా మోటొరోలా ఆధునిక అనంతమైన అనువైన డిజైన్‌లో నోస్టాల్జియా ఐకానిక్ భాగాన్ని అందిస్తోంది. razr 40 Ultra ఎగువ, దిగువ అంచులు తిరుగులేని విధంగా కలుసుకునేలా పూర్తిగా సగానికి మడవబడుతుంది.  అత్యంత స న్నని, సొగసైన రూపాన్ని సంపూర్ణంగా అందిస్తుంది. చాలా ఇతర ఫ్లిప్ ఫోన్‌ల వలె కాకుండా, razr 40 అల్ట్రా, దాని పునః రూపకల్పన చేయబడిన టియర్‌డ్రాప్ మూవబుల్ జాయింట్స్ కారణంగా స్క్రీన్‌పై ముడతలేవీ పడవు. అంతే గాకుండా ఇది పరిశ్రమలోనే మొట్టమొదటి డ్యూయల్ ఆక్సిస్ ట్రాకింగ్‌తో కూడా వస్తుంది. ఇది పరికరం పరిమాణాన్ని తగ్గిస్తుంది. తద్వారా రెండు రేజర్ ఫోన్‌లను కూడా వాటిని ఫ్లిప్ చేసినప్పుడు, పరిశ్రమలో ప్రపంచంలోనే అత్యంత స్లిమ్మెస్ట్ ఫ్లిప్ప బుల్ ఫోన్‌లుగా చేశాయి. razr 40 అల్ట్రా, razr 40 ఫీచర్ల ఐకానిక్ డిజైన్ వెనుకవైపు ప్రీమియం వెగాన్ లెదర్ ఎంపికతో కూడిన మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. ఇది పట్టుకోవడాన్నిసులభం చేస్తుంది, తాకడానికి మృదువుగా ఉంటుంది.
 
ఈ ఆవిష్కరణపై మోటరోలా ఆసియా పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, శ్రీ ప్రశాంత్ మణి మాట్లాడుతూ, "మోటరోలా సాంకేతిక త, ఆవిష్కరణలలో అగ్రగామిగా ఉంది. ఐకానిక్ రేజర్ వారసత్వానికి రెండు సరికొత్త జోడింపులను ప్రారంభించడం పట్ల మేం గర్విస్తున్నాం. మార్కెట్‌లో సంచలనం కలిగించడం, ప్రతి ఒక్క ఉత్పాదనతో ప్రమాణాలను పెంచడం చేస్తున్నాం. ఈ అత్యాధునిక పరికరాలు సాంకేతికత సరిహద్దులను నెడుతుంటాయి. అసాధారణమైన డిజైన్, విశేషమైన పనితీరు, అసమానమైన వినియోగదారు అనుభవాన్ని ఒకచోట చేర్చడం వంటి మా అన్వేషణను ప్రతిబింబిస్తాయి. రేజర్ 40 అల్ట్రా, రేజర్ 40 అనేవి ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్‌ల భవిష్యత్తును రూపొందిస్తాయి. మా విలువైన కస్టమర్ల అంచనాలను అధిగమిస్తాయి’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్‌కు చిక్కులు.. మహిళా కమిషన్ నోటీసులు.. వలంటీర్ల ఫిర్యాదు