ప్రముఖ చైనీ కంపెనీ లెనోవోకు చెందిన మోటరోలా.. ఎడ్జ్ సిరీస్ లో కొత్త ఫోన్లు భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. సెప్టెంబర్ 8న వర్చువల్ గా నిర్వహించే కార్యక్రమం ఇందుకు వేదికగా నిలవనుంది.
డైమెన్సిటీ 1050 చిప్ సెట్ తో కూడిన మోటరోలా ఎడ్జ్ (2022) ఫోన్ ను పరిచయం చేయనుంది. అమెరికాలో దీని ధర రూ.40,000గా ఉంది. భారత్ లోనూ ఇంచుమించు ఇదే ధరలో ఉండనుంది. అలాగే, మోటో ఎక్స్ 30 ప్రో లేదా మోటో ఎస్ 30 ప్రో మోడల్ ను కూడా విడుదల చేసే అవకాశాలున్నాయి.
ఫీచర్స్..
6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ ప్లే,
144 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటు
వెనుక భాగంలో మూడు కెమెరాలు
50 మెగాపిక్సల్ తో ప్రధాన కెమెరా ఉంటుంది.
సెల్ఫీల కోసం 32 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు.
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ టర్బో పవర్ చార్జర్ తదితర ఫీచర్లున్నాయి.