Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

చౌక ధరకు కోడక్ లెడ్ స్మార్ట్ టీవీ

Advertiesment
Kodak LED TV
, బుధవారం, 10 ఏప్రియల్ 2019 (17:54 IST)
స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నవారికి శుభవార్త. ఇప్పుడు దాదాపు సగం రేటుకే విభిన్న ఫీచర్‌లతో స్మార్ట్ టీవీ అందుబాటులోకి వచ్చింది. రూ.10,999 పెట్టగలిగితే మంచి స్మార్ట్ టీవీని సొంతం చేసుకుని మీ కలను సాకారం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొడక్ 32 అంగుళాల టీవీ ధర రూ.10,999గా ప్రకటించింది. ఈ టీవీ అసలు ధర రూ.20,990. అంటే దాదాపు 47 శాతం మీకు ఆదా అవుతుంది. 
 
యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ ఉన్న వారు ఈ టీవీపై 5 శాతం రాయితీ పొందవచ్చు. అయితే షరతులు వర్తిస్తాయి. కొడక్ 32 అంగుళాల స్మార్ట్‌టీవీ కొనుగోలుపై నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా కలదు. రూ.1,222 నెలవారీ చెల్లింపుతో ఈ టీవీని కొనవచ్చు. ఎక్స్చేంజ్ రూపంలో రూ.4,000 వరకూ తగ్గింపు పొందవచ్చు. 
 
చౌక ధరకే లభించే ఈ టీవీలో విస్తుపోయే ఫీచర్లు ఉన్నాయి. హెచ్‌డీ రెడీ, 20 వాట్ స్పీకర్, 60 హెర్జ్ట్ రిఫ్రెష్ రేటు, 2 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు వంటి ప్రత్యేకతలున్నాయి. యాంటీ గ్లేర్ ప్యానెల్, వైఫై కనెక్టివిటీ, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ఆండ్రాయిడ్ ఓఎస్, ఫేస్‌బుక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికల సంఘం పక్షపాతం... విమర్శలతో ఉక్కిరిబిక్కిరి