జియో నుంచి సూపర్ ప్లాన్ వచ్చింది. ఈ ప్లాన్ ధర కేవలం రూ.355 దీని వ్యాలిడిటీ 30 రోజులపాటు ఉంటుంది. ఈ ప్లాన్ ప్రకారం మొత్తంగా 25 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు. ఒక్కరోజులో ఎంత జీబీ అయినా వినియోగించుకోవచ్చు.
వారంలో పూర్తి జీబీ కూడా వాడొచ్చు. ఆపై 25 జిబి డేటా పూర్తయిన తర్వాత 64 కేబిపిఎస్ ఇంటర్నెట్ స్పీడ్ పొందుతారు. 30 రోజులపాటు ఈ ప్లాన్ వర్తిస్తుంది.
అలాగే 5జీ సేవలు మీ ప్రాంతంలో అందుబాటులో వుంటే.. 5జీ స్పీడ్ డేటా కూడా పొందవచ్చు. ఇందులో 100 ఎస్ఎంఎస్‌లు ప్రతిరోజూ ఉచితంగా పొందుతారు.
ఇంకా రిలయన్స్ జియో ఈ వ్యాలిడిటీ 30 రోజుల పాటు వర్తిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీరు ఏ నెట్‌వర్క్ అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. ఈ జియో రూ.350 ప్లాన్‌తో పాటు జియో సినిమా, జియో టీవీ, జియో సెక్యూరిటీ కూడా ఉచితంగా యాక్సెస్ పొందుతారు.