ఉద్యోగినితో ఇంటెల్ సీఈవో అక్రమ సంబంధం.. ఊడిన ఉద్యోగం
ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఇంటెల్ సీఈవో బ్రియాన్ జానిచ్ ఉద్యోగం ఊడింది. తమ సంస్థలో పని చేసే ఉద్యోగినితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం బహిర్గతం కావడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఇంటెల్ సీఈవో బ్రియాన్ జానిచ్ ఉద్యోగం ఊడింది. తమ సంస్థలో పని చేసే ఉద్యోగినితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం బహిర్గతం కావడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
1982లో ఇంటెల్‌లో ఇంజినీర్‌గా చేరిన జానిచ్... అంచలంచెలుగా ఎదిగి 2013లో సీఈవోగా బాధ్యతలను స్వీకరించారు. అంతకుముందు సీఎఫ్ఓగా కూడా పని చేశారు. అయితే, సహ ఉద్యోగినితో సంబంధం పెట్టుకున్నాడు.
సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ బ్రియాన్ రాజీనామాను కోరడం వల్లే ఆయన రిజైన్ చేశారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే, ఆయనతో సంబంధం కలిగిన మహిళ పేరును వెల్లడించడానికి మాత్రం వారు నిరాకరించారు. జానిచ్ రాజీనామా నేపథ్యంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాబ్ స్వాన్ తాత్కాలిక సీఈవోగా వ్యవహరిస్తారు.