Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లావా నుంచి రూ. 19,999కు కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే‌తో అగ్ని 2

Advertiesment
Lava Agni
, మంగళవారం, 16 మే 2023 (20:19 IST)
లావా మొబైల్స్ ఈరోజు కట్టింగ్-ఎడ్జ్ టెక్నాలజితో తన ప్రపంచ-స్థాయి అగ్ని 2 5జి స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. ఇది మధ్య-శ్రేణి స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు ఒక భారతీయ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. అగ్ని 2 5జి అన్ని కొత్త శక్తివంతమైన చిప్‎సెట్ మరియు సెగ్మెంట్-ఫస్ట్ విశేషాలతో ఉన్న లావా యొక్క అత్యంత ప్రావీణ్యత కలిగిన స్మార్ట్ ఫోన్. ఇతర స్మార్ట్ ఫోన్ల కంటే మెరుగైన ఇది, వేగవంతమైన గేమింగ్, యాప్ అనుభవాన్ని అందించే మీడియాటెక్ యొక్క ఆధునిక 7050 ప్రాసెసర్ ద్వారా ఆధారితమైన భారతదేశపు మొదటి స్మార్ట్ ఫోన్.
 
“అగ్ని 2 5జి, భారతీయ ఫైర్ పవర్, స్మార్ట్ ఫోన్ పరిశ్రమలో భారతదేశపు ఇంజనీరింగ్ యొక్క సంగ్రహాన్ని అందిస్తుంది. ఇది రూ. 20 వేల ధరల విభాగములో భారతదేశపు వినియోగదారుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేయబడింది. అగ్నిని ప్రపంచస్థాయిలో భారతదేశపు సాంకేతిక నైపుణ్యాన్ని చూపించే ఒక ఉత్పత్తిగా చేయడము మా లక్ష్యము. దీని ప్రపంచ-స్థాయి గుణాలు భారతీయ స్మార్ట్ ఫోన్ల గురించి మీ ఆలోచనలను మారుస్తాయి,” అని సునీల్ రైనా, ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్, లావా ఇంటర్నేషనల్ అన్నారు. దీని ధర ఐఎన్‎ఆర్ 21,999గా నిర్ణయించబడింది. అగ్ని 2 మే 24, 2023 నుండి అమెజాన్ పైన అన్ని ప్రధాన క్రెడిట్ & డెబిట్ కార్డ్స్ పై ఐఎన్‎ఆర్ 2000 డిస్కౌంట్ తో అందుబాటులో ఉంటుంది, దీనితో ఆరంభ ధర కేవలం ఐఎన్‎ఆర్ 19,999 అవుతుంది.
 
“మీడియాటెక్‎డిమెన్సిటి 7050 మృదువైన గేమింగ్ అనుభవాన్ని, అసాధారణమైన పవర్-సామర్త్యము, ఏఐ-కెమెరా మెరుగుదలలు, ఇంటలిజెంట్ పనితీరు, మరియు దీర్ఘకాల గేమింగ్ సెషన్స్ కొరకు ఎక్కువ బ్యాటరీ మన్నిక అందిస్తుంది”, అని అంకు జైన్, మేనేజింగ్ డైరెక్టర్ మీడియాటెక్ ఇండియా అన్నారు. “లావా అగ్ని2 5జి, మీడియాటెక్ 5జి అల్ట్రాసేవ్, స్ట్రీమర్స్ కొరకు శక్తివంతమైన మిరావిషన్ 4కే హెచ్‎డిఆర్ వీడియో ప్రాసెసింగ్, అత్యంత వేగవంతమైన ప్రతిస్పందన, మీడియాటెక్ హైపర్‎ఇంజన్ గేమింగ్ మెరుగుదలలతో అధిక-రెసొల్యూషన్ డిస్ప్లేలతో ఏకీకృతమైన మీడియాటెక్‎డిమెన్సిటి 7050 ద్వారా ఆధారితమైన భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. మరిన్ని కొత్త పురోగతులు మరియు విజయవంతమైన భవిష్యత్ సహకారాలతో పనిచేయాలని మేము ఆశిస్తున్నాము.”
 
తన 6.78 ఇంచ్ ఎఫ్‎హెచ్‎డి + 120 Hz రిఫ్రెష్ రేట్ తో స్క్రీన్ తో అగ్ని 2 అతిపెద్ద మరియు ఈ విభాగములో ఉత్తమమైన కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేను అందిస్తుంది. ఈ డిస్ప్లేకు 1.07 బిలియన్ కలర్ డెప్త్ ఉంది, ఇది నిజమైన సెగ్మెంట్ డిఫరెన్సియేటర్ మరియు హెచ్‎డిఆర్, హెచ్‎డిఆర్ 10, మరియు హెచ్‎డిఆర్ 10+ మరియు వైడ్‎వైన్ ఎల్1ను సపోర్ట్ చేస్తుంది. ఎర్గోనామిక్ 3డి డ్యుయల్ కర్వ్ డిజైన్ తో అగ్ని 2 పట్టుకోవటానికి సులభంగా ఉంటుంది మరియు ఆనందాన్ని ఇస్తుంది. ఇది డబల్ రీఇన్ఫోర్స్డ్ గ్లాస్ రక్షణతో మ్యాట్ ఫినిష్‌తో ప్రీమియం 3డి గ్లాస్ బ్యాక్ డిజైన్ అందిస్తుంది. దీనికి అత్యంత సన్ననైన (2.3ఎంఎం) బాటం బెజెల్ ఉంది మరియు స్క్రీన్ మరియు బాడి నిష్పత్తి 93.65% ఉంది. దీనిలో కంటికి ఆకర్షణీయమైన విరిడియన్ రంగు గ్లాస్ బ్యాక్‌తో వస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్‌కు ‘ఎంఎస్ ధోనీ ట్రోఫీ’ అని పేరు మార్చే సమయం వచ్చిందా?