Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గూగుల్ మొబైల్ సర్వీసులు లేని ''ఆనర్ వి6'' ట్యాబ్లెట్ విడుదల

గూగుల్ మొబైల్ సర్వీసులు లేని ''ఆనర్ వి6'' ట్యాబ్లెట్ విడుదల
, మంగళవారం, 19 మే 2020 (17:53 IST)
Honor Tablet V6
చైనీస్ మొబైల్ మేకర్ ఆనర్ నుంచి విడుదలయ్యే స్మార్ట్ ఫోన్లకు భారీ క్రేజుంది. ప్రస్తుతం అదే ఆనర్ కంపెనీ నుంచి ''ఆనర్ వి6'' పేరిట ట్యాబ్లెట్ విడుదలైంది. స్మార్ట్ లైఫ్ ఈవెంట్‌లో ఈ ట్యాబెట్లు విడుదలైంది. 
 
13 ఎంపీ రియర్ కెమెరా, ముందువైపు 8 ఎంపీ కెమెరా, మేజిక్ పెన్సిల్ పేరుతో స్టైలస్, బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకునే కీబోర్డు, వై-ఫై 6 కనెక్టివిటీ కలిగిన ఈ ట్యాబ్లెట్‌లో 7,250 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించినట్లు ఆనర్ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఈ ట్యాబ్లెట్‌లో గూగుల్ మొబైల్ సర్వీసులు లేవు. దీంతో యాప్స్‌ కోసం హువావే యాప్ గ్యాలరీపై ఆధారపడాల్సి ఉంటుంది.
 
అలాగే ''ఆనర్ వి6'' ఫీచర్ల సంగతికి వస్తే..?
5జీ సపోర్ట్, 
7,250 ఎంఏహెచ్ బ్యాటరీ
6జీబీ ర్యామ్, 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ, ఆండ్రాయిడ్ 10 ఆధారిత మ్యాజిక్ యూఐ 3.1 ఓఎస్ వంటివి ఉన్నాయి.
84 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 
7ఎన్ఎం ఆక్టాకోర్ హైసిలికాన్ కిరిన్ 985 ఎస్ఓసీ, 
10.4 అంగుళాల డిస్‌ప్లే వంటివి ఇందులో ఉన్నాయి.
గ్రే, గ్రీన్, బ్లాక్ రంగుల్లో ఈ ట్యాబ్లెట్ లభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నతల్లిపై నీచానికి ఒడిగట్టిన కుమారుడు.. నగ్న ఫోటోలను వాట్సాప్ గ్రూపులో పెట్టి?