Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోదావరిఖని కుర్రోడుకి పోర్బ్స్ ఇండియా గుర్తింపు

sayyad hafeez
, శుక్రవారం, 22 జులై 2022 (16:30 IST)
ప్రముఖ అంతర్జాతీయ బిజినెస్ మ్యాగజైన ఫోర్బ్స్ ఇండియా తాజాగా టాప్ 100 డిజిటల్ స్టార్స్‌‍ జాబితాను ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జిల్లాకు చెందిన యువకుడికి చోటుదక్కింది. ఈ కుర్రోడు పేరు సయ్యద్ హఫీజ్. ఈయనకు 32వ స్థానం లభించింది. 
 
యైటింక్లైన్‌ కాలనీకి చెందిన సయ్యద్‌ హఫీజ్‌ యూట్యూబ్‌లో నిర్వహిస్తున్న 'తెలుగు టెక్‌టట్స్‌'కు ఈ గుర్తింపు లభించింది. కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉన్న సయ్యద్‌ 2011లో 'తెలుగు టెక్‌టట్స్‌' పేరిట ఛానల్‌ ప్రారంభించారు. అప్పటినుంచి సెల్‌ఫోన్‌ వినియోగంతో పాటు వాటి ప్రత్యేకతలు, లాభనష్టాలు, వివిధ కంపెనీలకు చెందిన కొత్త ఫోన్ల అన్‌బాక్సింగ్‌, కొత్తగా వస్తున్న ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ గురించి వివరిస్తూ వీడియోలు చేస్తున్నారు. 
 
ప్రస్తుతం 16 లక్షల సబ్‌స్క్రైబర్లను చేరుకున్న హఫీజ్‌ యూట్యూబ్‌ ద్వారా నెలకు రూ.2 లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు. ఆయన వీడియోలు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని ఫోర్బ్స్‌ తన మ్యాగజైన్‌లో పేర్కొంది. 
 
సింగరేణి కార్మికుడి కుటుంబం నుంచి వచ్చిన హఫీజ్‌ ఉన్నత విద్య చదవకపోయినా తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో యూట్యూబ్‌ ద్వారా ఆకట్టుకుంటున్నారు. అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న హఫీజ్‌కు 'డిజిటల్‌ స్టార్స్‌'లో 32వ స్థానం దక్కించుకోవడంతో స్థానికంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆకాశమంతా గులాబీ రంగులోకి మారిపోయింది.. ఎందుకో తెలుసా?