Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫుల్ టైమ్ ఉద్యోగులకు 6నెలల వేతనం బోనస్.. ఫేస్‌బుక్

Advertiesment
Facebook
, శుక్రవారం, 20 మార్చి 2020 (12:41 IST)
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫేస్ బుక్ కూడా తమ సంస్థలో పనిచేస్తున్న 45వేల మంది ఫుల్ టైమ్ ఉద్యోగులకు ఆరు నెలల వేతనాన్ని బోనస్‌గా అందిస్తున్నామని ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో, తమను, తమ కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ఈ డబ్బులు కేటాయించుకోవాలన్నారు. 
 
వర్క్ ఫ్రమ్ హౌమ్ చేసే సదుపాయం కల్పించిన వారికి అదనంగా మరో 1000 డాలర్లు ఇవ్వనున్నామని జుకర్ బర్గ్ చెప్పారు. ఈ 1000 డాలర్లతో ఇంటి నుంచి పని చేసేందుకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పరచుకోవాలని సూచించారు.
 
అయితే, కాంట్రాక్టు ఉద్యోగులకు బోనస్ సదుపాయం ఉండదని తెలిపారు. ఇదే సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్న ఫేస్ బుక్ కార్యాలయాల్లో లాక్ డౌన్ ప్రకటించినా, వారు విధులకు రాకపోయినా పూర్తి వేతనం ఇస్తామని జుకర్ బర్గ్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకునేందుకు ఉద్యోగులకు సమయం అవసరమని జుకర్ బర్గ్ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామ రక్ష .. రాష్ట్ర స‌రిహ‌ద్దుల వ‌ద్ద 18 చెక్‌పోస్టులు