ప్రపంచం అంతటా చాట్‌జిపిటితో పాటు కృత్రిమంగా సాంకేతికతను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఓపన్ ఏఐ సంస్థ ప్రవేశపెట్టిన ChatGPT సాంకేతికత ప్రపంచంలో వివిధ మార్పులను సృష్టించింది. తాజాగా గూగుల్ సంస్థ బర్ట్ అనే పేరుతో సాంకేతికతను పరిచయం చేసింది. దీని వలన భవిష్యత్తులో చాలా కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.
తాజాగా చాట్‌జిపిటికి ఓపెన్ ఏఐ సంస్థ కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకూ చాట్‌జీపీటీని ఏది అడగాలన్నా కీబోర్డులో టైప్ చేసి అడగాల్సి వచ్చేదన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితి ఇకపై మారనుంది. ఇకపై యూజర్ల ప్రశ్నలకు రియల్ టైంలో సమాధానాలు ఇచ్చేలా చాట్‌బాట్ వచ్చేస్తోంది.
ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌ను చాట్‌జీపీటీ ప్లస్, కమర్షియల్ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి తెచ్చారు. త్వరలో నాన్ సబ్‌స్క్రైబర్లూ ఈ ఫీచర్ వాడుకునే అవకాశం వుంటుంది. తద్వారా చాట్‌జీపీటీతో యూజర్లు నేరుగా మాట్లాడే విధంగా కూడా మార్పులు చేస్తున్నట్టు ఏఐ పేర్కొంది.