Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 22 March 2025
webdunia

తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే మక్కెలిరగ్గొడతారు...

Advertiesment
తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే మక్కెలిరగ్గొడతారు...
, గురువారం, 11 మార్చి 2021 (06:23 IST)
భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో వ్యక్తులకు, వ్యవస్థలకు భంగం వాటిల్లేలా పోస్టులు పెడితే ఊరుకునేది లేదని ఇప్పటికే  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలుమార్లు హెచ్చరించయి. ఇపుడు అలాంటి ఫేక్ న్యూస్‌లు పెట్టేవారిని పసిగట్టి వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటారు.
 
నిజానికి సోషల్​ మీడియాలో ఫేక్​ న్యూస్​ ప్రచారం చేసే వారు భారత చట్టాల ప్రకారం శిక్షార్హులు. వారు ఫేక్​ న్యూస్​ ప్రచారం చేసినట్లు నిరూపితమైతే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్​, 2008లోని సెక్షన్ 66డి, డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ యాక్ట్​, 2005లోని సెక్షన్ 54, ఇండియన్​ పీనల్​ కోడ్​, 1860లోని 153, 499, 500, 505 (1) సెక్షన్ల ప్రకారం వారు శిక్షార్హులని కేంద్రప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 
 
వ్యక్తిపై వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేయడం, అతని గురించి తప్పుదోవ పట్టించే కంటెంట్​ను సోషల్​మీడియాలో ప్రచారం​ చేయడం, మోసపూరిత కంటెంట్, తప్పుడు లేదా మానిప్యులేటెడ్ కంటెంట్​ను సృష్టించి ఆ వ్యక్తిపై నిందలు మోపడం వంటివి ఫేక్​ న్యూస్​ కిందికే వస్తాయి. 
 
దేశంలో ఏదైనా అనుకోని విపత్తు సంభవించినప్పుడు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేవారు, లేదా ఆ విపత్తు తీవ్రత గురించి తప్పుడు హెచ్చరికలు చేస్తూ సోషల్​ మీడియా ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారు డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ యాక్ట్​ సెక్షన్ 54 ప్రకారం శిక్షార్హులు.
 
ఇదేకాక ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి షోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్‌పై కూడా పోలీసులు నిఘా పెంచనున్నారు. దీని కోసం ప్రత్యేకమైన నిఘా వ్యవ్యస్థను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా మహిళలు పెట్టిన ఫోటోలకు.. కామెంట్స్ పెట్టిన ఇకపై చర్యలు తప్పవని తెలుస్తోంది. 
 
సోషల్  మీడియానేకదా మనం ఏం చెప్పినా చెల్లుతుందనుకుంటే పొరపాటే. మీపై, మీరు పెట్టే పోష్టులపై కూడా నిఘా ఉంటుందని గుర్తించాలి. మీ మెయిల్, గూగుల్‌కు అటాచ్ అయి ఉంటుంది కాబట్టి, మీరు సెర్చ్ చేసే కీవర్డ్స్‌లో అసభ్యకరమైన పదజాలం, చైల్డ్ పోర్న్ కంటెంట్, టెర్రరిస్ట్ కంటెంట్.. ఏదైనా సెర్చ్ చేసిన వెంటనే ఆ కీవర్డ్స్ ఆధారంగా ఆటో మెషిన్ ద్వారా మీ పూర్తి వివరాలు.. నిఘా వర్గాలకు  చేరుతుంది. సో బీ కేర్ ఫుల్.. విత్ సోషల్ మీడియా. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మమతా బెనర్జీపై దాడి... ఈసీ ఆగ్రహం.. విచారణకు ఆదేశం