Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమేజాన్‌లో ప్రైమ్ డే భారీ ఆఫర్

అమేజాన్‌లో ప్రైమ్ డే భారీ ఆఫర్
, మంగళవారం, 25 జూన్ 2019 (17:19 IST)
ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ తమ వినియోగదారులకు మరోసారి శుభవార్త తెలిపింది. ఈ మేరకు అమేజాన్ ప్రైమ్ డే 2019 సేల్ పేరిట మరో కొత్త ఆఫర్‌ని ప్రకటించింది. 
 
వివరాలలోకి వెళ్తే... జూలై నెల 15, 16 తేదీలలో ప్రైమ్ డే సేల్‌ పేరిట కొత్త ఉత్పత్తులు, మొబైల్‌లపై డిస్కౌంట్ ఆఫర్ అందజేయనున్నట్లు అమేజాన్ ప్రకటించింది. ఈ ఆఫర్ 48 గంటల వరకు ఉంటుందనీ, ప్రైమ్ వీడియో అండ్ ప్రైమ్ మ్యూజిక్‌తోపాటు మరి కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంస్థ తెలియజేసింది. ఈ సంస్థ గత సంవత్సరంలో కూడా 36 గంటలపాటు ఇదే తరహా ఆఫర్ ప్రకటించింది. 
 
కాగా... ఈ సంవత్సరం కూడా కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేసిన హెచ్‌డీఎఫ్‌సీ తాఖాదారులకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభించనుంది. ఈ సంవత్సరంలో 1,000 ఉత్పత్తులను అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ప్లాన్ క్రింద వన్‌ ప్లస్‌, అమేజాన్ బేసిక్స్, శామ్‌సంగ్, ఇంటెల్ సంస్థల ఉత్పత్తులపై కూడా భారీ ఆఫర్ ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య దూరిన మహిళ..అలా ఇరుక్కుపోయింది... వైరల్ వీడియో