రూ.1299కే విమాన టిక్కెట్ : మాన్‌సూన్ సేల్ పేరుతో విస్తారా ఆఫర్

మంగళవారం, 18 జూన్ 2019 (21:41 IST)
దేశంలో విమాన సర్వీసులు అందిస్తున్న మరో ప్రైవేట్ విమానయాన సంస్థ విస్తారా. ఈ సంస్థ దేశంలోని పలు నగరాలను విమాన సర్వీసులను నడుపుతోంది. ఇపుడు మాన్‌సూన్ సేల్ పేరుతో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. 
 
ఈ ఆఫర్‌లో రూ.1299కే టిక్కెట్ ధరను ప్రకటించింది. అయితే, ఈ టిక్కెట్లను మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం అర్థరాత్రి 11.59 గంటల వరకు మాత్రమే కొనుగోలు చేయాల్సి వుంటుంది. ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. ఆ తర్వాత ముగిసిపోతుంది. ఈ ఆఫర్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునేవారు జూలై 3వ తేదీ నుంచి సెప్టెంబరు 26వ తేదీ మధ్య ప్రయాణించే వెసులుబాటును కల్పించారు. 
 
కాగా, ఇటీవల విస్తారా సంస్థకు 62 కొత్త విమానాలు వచ్చి కలిశాయి. దీంతో విమానాల సంఖ్య 170కి చేరింది. ఈ సంస్థ ప్రతి రోజూ 24 గమ్యస్థానాలకు రోజూ విమానాలు నడుపుతోంది. ముంబై నుంచి 10 నగరాలు అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, వారణాసి, అమృత్‌సర్, ఢిల్లీ, గోవా, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా నగరాలకు విస్తారా నేరుగా సర్వీసులు అందిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బాబు ఆ మాట అనగానే పగలబడి నవ్విన సీఎం జగన్... ఎందుకని?