Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరుల త్యాగాన్ని స్మరించడమే 'మొహర్రం'

Advertiesment
అమరుల త్యాగాన్ని స్మరించడమే 'మొహర్రం'
, మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (08:40 IST)
ముస్లింలు పాల్గొని అమరవీరులకు హల్బిదా, హల్బిదా అంటూ చెస్ట్ బీటింగ్ చేస్తూ రక్తం చిందించే రోజు మొహర్రం రానే వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో హైద్రాబాద్, మచిలీపట్నంలో రెండు ప్రాంతాల్లో మాత్రమే మోహరం సందర్బంగా చెస్ట్ బీటింగ్ నిర్వహించేవారు.

అయితే రెండు రాష్ట్రాలు వెరైన పరిస్థితుల్లో ఆంధ్రరాష్ట్రంలోని ఒక్క మచిలీపట్నంలో ముస్లింలు చెస్ట్ బీటింగ్ కార్యక్రమం నిర్వహిస్తుండటం ప్రాముఖ్యత సంతరించుకుంది. బ్రిటిష్ కాలంకంటే ముందునుండి హైద్రాబాదు, మచిలీపట్నంకు వాణిజ్య పరమైన సత్సంబంధాలు ఉన్నాయని చారిత్ర చెబుతుంది.
 
మొహర్రం పండుగ కాదు. అమరవీరుల త్యాగాన్ని స్మరించడమే. మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులు కృష్ణా జిల్లా, మచిలీపట్నం, ఇనుగుదురుపేటలో మోహరం 9వ రోజు పీర్లను ఉరేగిస్తూ "చెస్ట్ బీటింగ్" కార్యక్రమము నిర్వహించారు. రేపు 10 వరోజు మోహరం సందర్బంగా రక్తం చిందిస్తూ చెస్ట్ బీటింగ్ నిర్వహిస్తారు.
 
1400 ఏళ్ల  క్రితం హిజ్రీశకం 60 లో జరిగిన యదార్ధ ఘటనకు ప్రతి రూపం. మహనీయులు మహమ్మద్ ప్రవక్త అల్లాహ్ నుండి దైవవాణి గ్రహించి దానిని దివ్యఖురానుగా గ్రంథస్తం చేశారు. ఇస్లాం ప్రపంచ వ్యాప్తంగా ఆయన అడుగు జాడల్లో విస్తరించింది.
 
ఈ నేపధ్యంలో అప్పటి ఇస్లాం రాజ్యాధిపతి యాజిద్  సిద్దాంతాన్ని ధిక్కరించి ఇస్లాంలో తన సిద్దాంతాన్ని జోడించడంతో మహమ్మద్ ప్రవక్త మనవడు హాజరత్ ఇమామ్ హుసైన్ ఎదిరించారు. దీంతో కుటుంబ సభ్యులు 72 మంది అంతా యుద్ధ మైదానంలో నిలబడవలసి వచ్చింది. ఇహలోకం కంటే పరలోకమే మేలని ప్రాణత్యాగానికైనా సిద్ధమని నిలబడ్డారు.
 
 ఎట్టి పరిస్థితిల్లోనూ ఇస్లాం సిద్దాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడాలని అని యాజిద్ బలవంతం చేసాడు. జాలీ, కరుణ, కనికరం లేకుండా అత్యంత హేయంగా ఇమామ్ హుస్సేన్ కుటుంబసభ్యులను శత్రు సైన్యం ఇరాక్ లోని అప్పటి కార్బాల యుద్ధ మైదానంలో హతమార్చారు. 
 
2 ఏళ్ల చిన్నారిని సైతం వదలకుండా క్రూరంగా హతమందించారు. మొహర్రం నెల 10 వరోజు హాజరత్ ఇమాం హుసైన్ సైతం వీర మరణం పొందారు. ఈ త్యాగనిరతికి ప్రపంచం ఆశ్చర్య పోయింది. ఇస్లాం అంటే ప్రాణాలు, కుటుంబం బలిదానం అని, మహత్తరమైనది తేలిపోయింది.
 
ఇస్లాం అంటే శాంతి అని ఆ మత ఆచారాలను, వాస్తవాలను తెలుసుకోవాలని ప్రపంచమంతా జిజ్ఞాశా కలిగింది. ఇస్లాం వేగంగా విస్తరించింది. ఇస్లాం పునర్జీవానికి ప్రాణం పోసిన ఆ అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహర్రం. అందుకే మొహర్రం పండుగ కాదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ మూడు మీలో ఉంటే, మిమ్ముల్ని ఏదీ అడ్డుకోలేదు