1. పవిత్రత ఒక మహత్తర శక్తి. దాని ముందు సర్వం భయంతో కంపిస్తుంది.
2. మాటలను ప్రోగుచేసేది నిజమైన విద్య కాదు. ప్రజ్ఞను పెంపొందించేదే విద్య, సంకల్ప శక్తిని సరైన రీతిలో, నైపుణ్యంగా ఉపయోగించేలా, వ్యక్తులకు ఇచ్చే శిక్షణే విద్య.
3. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దానిని లెక్కచేయకు. కాలం అనంతం. ముందుకు సాగిపో, నీ ఆత్మ శక్తిని మరల మరల కూడగట్టుకో, వెలుగు వచ్చే తీరుతుంది.
4. విధేయత, సంసిద్ధత, కర్తవ్యం మీద ప్రేమ- ఈ మూడు మీలో ఉంటే, మిమ్ముల్ని ఏదీ అడ్డుకోలేదు.
5. అనంతమైన ఓర్పు, అనంతమైన పవిత్రత, అనంతమైన పట్టుదల ఇవే సత్కర్మ సఫలమవటంలోని రహస్యాలు.