Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మెుహర్రమ్' రోజునా రోజా పాటించాలి.. ఎందుకుంటే..?

మెుహర్రమ్ ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన మాసం. ఇస్లామ్‌లోనే దీనికొక ప్రత్యేకత ఉంది. ఇస్లామ్ క్యాలండర్ ప్రకారం మెుహర్రమ్ ముస్లిమ్‌లకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ముస్లిమ్‌లకు ప్రాచీనకాలంలో అప్పటి సమాజంల

Advertiesment
'మెుహర్రమ్' రోజునా రోజా పాటించాలి.. ఎందుకుంటే..?
, బుధవారం, 19 సెప్టెంబరు 2018 (15:00 IST)
మెుహర్రమ్ ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన మాసం. ఇస్లామ్‌లోనే దీనికొక ప్రత్యేకత ఉంది. ఇస్లామ్ క్యాలండర్ ప్రకారం మెుహర్రమ్ ముస్లిమ్‌లకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ముస్లిమ్‌లకు ప్రాచీనకాలంలో అప్పటి సమాజంలో కూడా మెుహర్రమ్ నుండే నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది. ముహమ్మద్ అనే వ్యక్తి ఈ మాసాన్ని అల్లాహ్ నెల అని అభివర్ణించారు.
  
 
రమ్‌జాన్ రోజాల తరువాత ముఖ్యమైన రోజా ఆషూరా రోజానే. అంటే దీని అర్థం మెుహర్రమ్ పదవ తేదిన పాటించబడే రోజానే ఆషూరా రోజా అంటారు. రమ్‌జాన్ రోజాలు విధిగా, ఆషూరా రోజాలు ఫర్జ్‌గా ఉండేవి. కానీ రమ్‌జాన్ రోజాలు విధిగా నిర్ణయించన తరువాత ఆషూరా రోజా నఫిల్‌గా మారిపోయింది. ఓసారి ప్రవక్త మహనీయులు మదీనాకు వెళ్ళారు. 
 
ఆరోజున అక్కడి యూదులు రోజా పాటిస్తున్నారు. ఆ రోజే మెుహర్రమ్ పదవ తేది. యూదులను చూసి ప్రవక్త ఇలా అడిగారు.. ఏమిటి ఈరోజు విశేషమని. దానికి యూదులు ఈరోజే అల్లాహ్ మూసాను ఆయన జాతిని ఫిరౌన్ బారినుండి రక్షించారు. ఫిరౌన్ అతని సైన్యాన్ని సముద్రంలో ముంచేశాడు. ఆ నాడు మూసా ప్రవక్త దేవునికి కృతజ్ఞతలు తెలుపగా రోజా పాటించాడు. 
 
అందుతే మేము కూడా ఆయన అనుసరణలో ఈ రోజున రోజా పాటిస్తామని యూదులు చెప్పారు. ఆషూర రోజా కేవలం యూదులు మాత్రమే కాదు క్రైస్తవులు కూడా పాటించేవారు. ఈ రెండు వర్గాలు మెుహర్రమ్ పదవ తేదిన మాత్రమే రోజా పాటించేవారు. కానీ ప్రవక్తవారు సహచరులకు రెండురోజులు రోజా పాటించాలని బోధించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రహ్మ దేవుని గురించి తెలుసా..?