ఐపీఎల్‌లో మరో ఘనత సాధించాడు విరాట్ కోహ్లీ. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 61 బంతుల్లో 101 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఈ ఐపీఎల్ 2023 సీజన్‌లో కోహ్లీకి ఇది రెండో సెంచరీ కావడం గమనార్హం. తద్వారా వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు.
ఇంకా అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు. క్రిస్ గేల్ ఐపీఎల్‌లో ఆరు శతకాలు సాధించగా, కోహ్లీ ఏడు సెంచరీలతో గేల్‌ను బ్రేక్ చేశాడు అర్థ సెంచరీలలో కూడా ఐపీఎల్ రికార్డు కూడా కోహ్లీ పేరిట వుంది. ఇప్పటి వరకు కోహ్లీ 50 హాఫ్ సెంచరీలను నమోదు చేయగా... 31 అర్ధ శతకాలతో గేల్ రెండో స్థానంలో ఉన్నాడు.