కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో 2021లో విరాట్ కోహ్లీకి షాకుల మీద షాక్‌లు తప్పట్లేదు. కారణం.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్… చేతి వేలి గాయం కారణంగా.. ఐపీఎల్ 2021 రెండోదశ మ్యాచ్‌లకు పూర్తిగా దూరమయ్యాడు.
ఆర్సీబీ కీలక ఆటగాళ్లలో ఒకడైన సుందర్ సీజన్ మొత్తానికి దూరం కావడంతో ఆ జట్టు పై ప్రభావం పడుతుంది. సుందర్ స్థానంలో బెంగాల్ బౌలర్ ఆకాష్ దీప్‌కు ఛాన్స్ ఇచ్చింది.
ప్రస్తుతం ఆకాష్ దీప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు క్యాంప్‌లో నెట్ బౌలర్‌గా ఉన్నాడు. ఇక అంతకు ముందు సుందర్ ఇదే చేతి వేలి గాయం కారణంగా ఇంగ్లాండ్ పర్యటన నుంచి అర్ధాంతరంగా వైదొలగిన సంగతి విదితమే.
కాగా యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 రెండోదశ మ్యాచులు సెప్టెంబర్ 19 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక ఇప్పటికే కొన్ని జట్లు దుబాయ్ చేరుకుని ప్రాక్టీస్ మ్యాచ్‌లో నిమగ్నమై ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 19న మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.