Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా కుటుంబానికి ఘోరం జరిగింది.. మా మామయ్య హత్యకు గురయ్యారు.. రైనా (video)

Advertiesment
మా కుటుంబానికి ఘోరం జరిగింది.. మా మామయ్య హత్యకు గురయ్యారు.. రైనా (video)
, మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (13:28 IST)
టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్, వైస్ కెప్టెన్ సురేష్ రైనా షాకింగ్ నిజాన్ని వెల్లగక్కాడు. రైనా మూడు రోజుల క్రితమే త్వరలో జరగబోయే ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే, అప్పుడు స్పష్టమైన కారణాలు తెలియకపోయినా, ఈ దుర్ఘటన కారణంగానే అతడు తిరిగి స్వదేశానికి వచ్చినట్లు తెలుస్తోంది. 
 
ఐపీఎల్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్న కారణాన్ని వెల్లడించాడు. కొద్ది సేపటి క్రితమే రెండు ట్వీట్లు చేసిన ఆయన పంజాబ్‌లో తమ కుటుంబంలో చోటుచేసుకున్న దుర్ఘటనపై స్పందించాడు. అక్కడ జరిగింది దారుణం కంటే ఘోరమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
 
పంజాబ్‌లో తమ కుటుంబానికి జరిగింది ఘోరమమన్నాడు. మా మమయ్య హత్యకు గురయ్యారని.. మా మేనత్త, వాళ్ల ఇద్దరు కుమారులు తీవ్ర గాయాలపాలయ్యారు. దురదృష్టం కొద్దీ గత రాత్రి మరొకరు కన్నుమూశారు. ఇప్పటికీ మా అత్తయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని సురేష్ రైనా ట్విట్టర్ ద్వారా తెలిపారు.
 
అనంతరం మరో ట్వీట్‌లో.. ఆరోజు రాత్రి ఏం జరిగిందనే విషయంపై మాకెవరికీ సమాచారం లేదు. ఎవరు ఈ ఘోరానికి పాల్పడ్డారో కూడా తెలియదు. ఈ విషయంపై పంజాబ్‌ పోలీసులు త్వరగా దర్యాప్తు చేయాలని కోరుతున్నా. వాళ్లని ఇంతలా క్రూరంగా హింసించిన వాళ్లెవరో మాకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ నేరస్థులు మరిన్ని ఘోరాలు చేయడానికి అవకాశం ఇవ్వొద్దంటూ అని పంజాబ్‌ సీఎంను ట్యాగ్‌ చేశారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్-2020.. చెన్నై తరపున హర్భజన్ సింగ్ ఆడుతాడో? లేదో?