Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ 2020 : 'రాయల్స్‌'కు సవాల్.. 'కింగ్స్‌'కు ప్రతిష్టాత్మకం!

Advertiesment
IPL 2020 Match 4
, మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (09:23 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీలో భాగంగా మంగళవారం మరో కీలక లీగ్ మ్యాచ్ జరుగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య నాలుగో మ్యాచ్ జరుగనుంది. రాయల్స్ ఆడుతున్న తొలి మ్యాచ్‌లో ధీటైన పోటీని ఎదుర్కోనుంది. షార్జా వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. 
 
ఆరంభ సమరంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబైని కంగుతినిపించిన ఊపులో ఉన్న సీఎక్సే ఈ పోరులోనూ అదే ప్రదర్శన చేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు పెద్దగా మ్యాచ్‌ విన్నర్లులేని రాజస్థాన్‌ అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగుతోంది. జోఫ్రా ఆర్చర్‌, టామ్‌ కర్రాన్‌, జోస్‌ బట్లర్‌, కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ రాజస్థాన్‌కు ప్రధాన ఆటగాళ్లు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చినందున బట్లర్‌ ఆరు రోజుల స్వీయనిర్బంధంలో ఉండాల్సి వస్తోంది.
 
దాంతో మొదటి మ్యాచ్‌కు బట్లర్‌ అందుబాటులో ఉండకపోవడం రాజస్థాన్‌కు దెబ్బే. ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఎప్పుడు వచ్చేది స్పష్టత లేకపోవడంతో.. బ్యాటింగ్‌కు సంబంధించి స్మిత్‌పై పెద్ద భారమే పడనుంది. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌ డేవిడ్‌ మిల్లర్‌తోపాటు యువ ఆటగాళ్లు సంజూ శాంసన్‌, యశస్వీ జైస్వాల్‌, రియాన్‌ పరాగ్‌పై రాజస్థాన్‌ బ్యాటింగ్‌ ఆధారపడి ఉంది. మొత్తంగా..ఉత్కంఠ పోరులో పటిష్ట ముంబైకి షాకిచ్చిన ధోనీసేనను అడ్డుకోవడం రాజస్థాన్‌కు పరీక్షే.
 
అయితే, చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆడేందుకు రాజస్థాన్‌  కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు అనుమతి లభించడం ఆ జట్టుకు శుభవార్త. తలకు గాయం కావడంతో ఇటీవల ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల  సిరీస్‌కు స్మిత్‌ దూరమయ్యాడు. తొలి వన్డే ఆరంభానికి కొన్ని గంటల ముందే ప్రాక్టీస్‌ చేస్తుండగా తలకు దెబ్బతగలడంతో సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. అప్పటి నుంచి నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూనే ఉన్నాడు. రాజస్థాన్‌ ఆరంభ మ్యాచ్‌లకు  స్మిత్‌ బరిలో ఉండటం లేదని వస్తున్న వార్తలపై ఆ జట్టు ప్రధాన కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ క్లారిటీ ఇచ్చాడు.
webdunia
 
'స్టీవ్‌ స్మిత్‌ అందుబాటులోకి రావడం అనేది చాలా శుభవార్త కలిగించే వార్త. రాజస్థాన్‌ ఆడే తొలి మ్యాచ్‌లో ఆడేందుకు అతడు రెడీగా ఉన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఆటగాళ్లందరూ లీగ్‌ కోసం బాగా సన్నద్ధమయ్యారు. స్మిత్‌ రాకతో జట్టు మరింత బలోపేతమైంది. అన్ని విభాగాల్లో జట్టు బలంగా ఉన్నది. చెన్నైతో జరిగే పోరులో మా జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని' అంటూ ఆండ్రూ వ్యాఖ్యానించాడు. 
 
ఇరు జట్లూ ఇప్పటివరకు మొత్తం 21 మ్యాచ్‌లలో తలపడ్డాయి. అందులో రాయల్స్ ఏడు మ్యాచ్‌లలో గెలుపొందగా సీఎస్కే జట్టు 14 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఇందులో హోం గ్రౌండ్స్‌లో రాయల్స్ 5, సీఎస్కే 8 మ్యాచ్‌లలో గెలుపొందాయి. పరాయి గడ్డపై రాయల్స్ ఒక మ్యాచ్‌లో కింగ్స్ 3 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. రాయల్స్ జట్టు అత్యధికంగా 223 పరుగులు చేయగా, కింగ్స్ 246 పరుగులు చేసింది. అలాగే రాయల్స్ చేసిన అతి స్వల్ప స్కోరు 110 కాగా, కింగ్స్ 109 రన్స్ చేసింది. అత్యధిక పరుగుల ఛేదనలో రాయల్స్ 176 రన్స్‌ను ఛేదించగా, కింగ్స్ 185 పరుగుల టార్గెట్‌ను రీచ్ అయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2020 : హైదరాబాద్‌ను తిప్పేసిన చాహల్.. బెంగుళూరుదే గెలుపు