ట్వంటీ-20ల్లో వెయ్యి సిక్సర్లు కొట్టిన ఫస్ట్ క్రికెటర్‌గా క్రిస్ గేల్ హిస్టరీ క్రియేట్ చేశాడు. కార్తీక్ త్యాగి వేసిన 19వ ఓవర్లో కొట్టిన సిక్స్‌తో అతను ఈ మార్కు చేరుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో హయ్యెస్ట్ సిక్సర్ల (1001) రికార్డు గేల్ పేరిటే ఉంది. కీరన్ పొలార్డ్ (690) సెకండ్ ప్లేస్‌లో ఉండగా, బ్రెండన్ మెకల్లమ్ (485), షేన్ వాట్సన్ (467), ఆండ్రీ రసెల్ (447) టాప్-5లో నిలిచారు.
అలవోకగా సిక్సర్లు ఫోర్లు బాదేస్తూ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాడు క్రిస్ గేల్. టి-20 ఫార్మెట్లోనూ ఒక్కసారి క్రిస్ గేల్ క్రీజులో కుదురుకున్నాడు అంటే క్రిస్ గేల్ విధ్వంసాన్ని ఆపడం దిగ్గజ బౌలర్‌తో సాధ్యం కాదు అనడంలో అతిశయోక్తి లేదు. 41 ఏళ్ల వయసు దాటిపోతే కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా భారీ సిక్సర్లు కొడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు క్రిస్ గేల్.
ఇక శుక్రవారం రాజస్థాన్ రాయల్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టుకు కె.ఎల్.రాహుల్ అవుట్ కావడంతో నిరాశే ఎదురైంది. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్ సృష్టించిన విధ్వంసం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎలాంటి బాల్ వేసిన దానిని సిక్సర్ గా మలుస్తూ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించాడు క్రిస్ గేల్.
దీంతో క్రిస్ గేల్ కి ఎలా బోలింగ్ చేయాలో కూడా అర్థం కాక అయోమయంలో మునిగిపోయారు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు. ఈ క్రమంలోనే నిన్న భారీగా సిక్సర్లు బాది ప్రపంచ క్రికెట్ చరిత్రలో వెయ్యి సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్ గా అరుదైన రికార్డు సృష్టించాడు క్రిస్ గేల్.