Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ 2020: ధోనీ టీమ్‌కు తగ్గని క్రేజ్.. ఇంటికి మొత్తం పసుపు రంగు కొట్టేశాడు..

ఐపీఎల్ 2020: ధోనీ టీమ్‌కు తగ్గని క్రేజ్.. ఇంటికి మొత్తం పసుపు రంగు కొట్టేశాడు..
, బుధవారం, 14 అక్టోబరు 2020 (20:49 IST)
Chennai Super kings
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ రసవత్తరంగా జరుగుతోంది. ఈ సీజన్‌లో మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా... ఆ జట్టుకున్న క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఇక చెన్నై సాధించిన విజయాల్లో స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డుప్లెసిస్‌ పాత్ర ఎంతో ఉంది. బ్యాట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే డుప్లెసిస్‌..అద్భుత ఫీల్డింగ్‌ విన్యాసాలతో కళ్లు చెదిరే క్యాచ్‌లను అందుకున్నాడు. ముఖ్యంగా జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అత్యుత్తమ అటతీరును ప్రదర్శిస్తుంటాడు.
 
ఐపీఎల్‌-13లో నిలకడగా రాణిస్తున్న డుప్లెసిస్‌.. మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఖాతా అయినా తెరువకుండానే మూడో ఓవర్లో వికెట్‌ కీపర్‌ బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఓపెనర్‌ డుప్లెసిస్‌ (0) తాను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌ చేరాడు. మూడో ఓవర్‌లోనే ఓపెనర్‌ డుప్లెసిని డకౌట్‌ చేసిన సందీప్‌ శర్మ చెన్నైకి ఝలక్‌ ఇచ్చాడు.
 
ఓవరాల్‌గా ఐపీఎల్‌లో డుప్లెసిస్‌ డకౌట్‌ కావడం మూడోసారి కాగా, 2014 తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ప్రస్తుత సీజన్‌లో చెన్నై తరఫున అద్భుతంగా రాణిస్తూ చెన్నై తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సీజన్‌లో ఇప్పటి వరకు 51.16 సగటుతో 307 పరుగులు సాధించాడు.
 
మరోవైపు ధోనీకున్న అభిమానం కూడా తగ్గట్లేదు. ఈ క్రమంలో ఓ ధోనీ అభిమాని వినూత్నంగా ఆలోచించాడు. ఇప్పుడు ఆ అభిమాని చేసి పని సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది. అతడే.. గోపి క్రిష్ణన్ భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని, ధోని అంటే ఎంతో అభిమానం. ఆయనది తమిళనాడుకు చెందిన కడలూరు జిల్లా ఆరంగుర్ గ్రామవాసి.
 
ధోనీపై తనకు ఉన్న అభిమానంతో .. తన ఇంటికి మొత్తం ఐపీఎల్‌ చెన్నై రంగు అయిన పసుపుతో నింపేసాడు. తన ఇంటి ముందు గోడలపైన ధోని చిత్రాలని, పక్క గోడలపైన సీఎస్కే లోగో ను అలాగే "విజిల్ పోడు" అనే ట్యాగ్ లైన్‌ను పెయింట్ చేయించాడు.
 
ఇక ఆ ఇంటి ఫోటోలను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను దోనీకి గొప్ప అభిమానిని, ధోనీపై అభిమానంతోనే ఇలా చేశా..అతనిపై చాలామంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. క్రికెట్‌లో అతను ఓ గొప్ప ఫినిషర్ అనే సంగతిని జనం మర్చిపోయారు. అందుకే నేను నా ఇంటిపై ధోనీ చిత్రాలు గీయించి ఆయన గొప్పతనం చాటాలనుకున్నాను అని చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అది వైడ్ బాలా? కాదా? కోపంతో చూస్తూ గొణిగిన ధోనీ- వీడియో వైరల్ (video)