ఈ శతకం మామకు అంకితం... అంబటి రాయుడు (వీడియో)
ఐపీఎల్ 2018 టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌ను అంబటి రాయుడు ఎడాపెడా ఉతికిఆరేశాడు. అలా ఇలా బాదలేదు.. శతకం బాదేశాడు. కళాత్మక విధ్వంసం సృష్టిస్తూ కళ్లుచెదిరే శతకంతో చెన్నైకు అద్భుత విజయం అందించా
ఐపీఎల్ 2018 టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌ను అంబటి రాయుడు ఎడాపెడా ఉతికిఆరేశాడు. అలా ఇలా బాదలేదు.. శతకం బాదేశాడు. కళాత్మక విధ్వంసం సృష్టిస్తూ కళ్లుచెదిరే శతకంతో చెన్నైకు అద్భుత విజయం అందించాడు.
ఈ మ్యాచ్ అనంతరం అంబటి రాయుడు స్పందిస్తూ, సన్‌రైజర్స్‌పై అద్భుత రీతిలో చెలరేగి అజేయ శతకాన్ని తన మేనమామకు అంకితం చేస్తున్నట్టు చెప్పాడు. రాయుడు మేనమామ మెండు సత్యనారాయణ ఆదివారం ఉదయం మరణించాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
నిజానికి ట్వంటీ20ల్లో ఓపెనింగ్ స్థానం చాలా ముఖ్యమైంది. ఈ స్థానంలో ఆడడాన్ని ఆస్వాదిస్తున్నా. ఓపెనింగ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. 4 రోజుల క్రికెట్‌లో రాణిస్తే ఏ స్థానంలో అయిన బ్యాటింగ్ చేయగలం అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో 62 బంతులు ఎదుర్కొన్న అంబటి రాయుడు.. ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లతో వంద పరుగులు చేశాడు.