Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గొంతునొప్పి అని వెళ్తే ఏలికపామును వెలికి తీశారు.. పచ్చి చేపను అలానే తినడం వల్లే?

Advertiesment
గొంతునొప్పి అని వెళ్తే ఏలికపామును వెలికి తీశారు.. పచ్చి చేపను అలానే తినడం వల్లే?
, బుధవారం, 15 జులై 2020 (19:21 IST)
Worm
గొంతునొప్పిగా వుందని డాక్టర్ వద్దకు వెళ్లిన మహిళను పరీక్షించిన వైద్యులు అవాక్కయ్యారు. గొంతునొప్పితో బాధపడుతూ తన దగ్గరికి వచ్చిన ఓ మహిళ టాన్సిల్స్‌‌‍లో పెద్ద ఏలికపామును చూసి వైద్యలు షాకయ్యారు. ఈ ఘటన జపాన్‌లోని టోక్యోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని టోక్యోకు చెందిన ఓ 25 ఏళ్ల మహిళ గొంతునొప్పితో బాధపడుతూ సెయింట్‌ లూకా దవాఖానకు వచ్చింది. 
 
అయితే, సాధారణంగా వాతావరణ మార్పుల వల్ల వచ్చిన జలుబు వల్ల గొంతునొప్పి వచ్చిందని డాక్టర్లు మొదట భావించారు. కాగా, తాను సాషిమిని అనే చేపను తిన్న తర్వాత ఈ నొప్పి ప్రారంభమైందని ఆమె వైద్యులకు వివరించింది. 
 
ఈ చేపను జపనీయులు పచ్చిగానే ఉడికించకుండా తినేస్తుంటారు. దీన్ని విన్న వైద్యులు ఎందుకో నిశితంగా పరీక్షించగా..  గవదలలో ఓ ఏలికపామున్నట్లు గుర్తించారు. ఇది ఏకంగా 1.5 అంగుళాల పొడవు వున్నది. దానిని అతినెమ్మదిగా తొలగించి, మహిళ ప్రాణం కాపాడారు. 
 
ఒక మిల్లీ మీటర్‌ వెడల్పు గల ఈ రౌండ్‌వార్మ్‌ను మహిళ టాన్సిల్స్ నుంచి పట్టుకారు ఉపయోగించి తొలగించారు. తొలగించేటప్పుడు కూడా ఈ ఏలికపాము సజీవంగానే ఉంది. డీఎన్‌ఏ పరీక్ష తరువాత, అది నాలుగో దశ లార్వాగా గుర్తించారు. అంటే సదరు మహిళ సాషిమి డిష్‌ తీసుకున్నప్పుడు అది మూడో దశ లార్వాగా ఉన్నదని పేర్కొన్నారు. 
 
పచ్చిమాంసం తినేవారిలో ఈ పరాన్నజీవులు కనిపిస్తాయని వారు వివరించారు. సదరు మహిళ పరిస్థితి అదృష్టవశాత్తు బాగానే ఉందని, ప్రస్తుతం కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనా కంపెనీకి భారత్ షాక్? వందే భారత్‌ రైళ్ల తయారీ ప్రాజెక్టు నుంచి ఔట్?