Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

World Malala Day 2022.. ఎందుకు?

Malala
, మంగళవారం, 12 జులై 2022 (17:45 IST)
బాలికల విద్య కోసం పోరాడుతున్న కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం జూలై 12వ తేదీన అంతర్జాతీయ మలాలా దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
 
స్త్రీ విద్య కోసం పోరాడుతున్న ఈ యువతికి గౌరవార్థం.. ఆమె పుట్టిన రోజున మలాలా దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.
 
మలాలా యూసుఫ్‌జాయ్ పాకిస్థాన్‌లోని మింగోరాలో 1997లో జన్మించింది. ఆమె 2008లో మహిళా విద్య కోసం తన పోరాటాన్ని ప్రారంభించింది. 
 
బాలికలు విద్య అవసరమంటూ చాటి చెప్పేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆమెపై 2012లో తాలిబాన్లు దాడి చేసిన సంగతి తెలిసిందే.
 
స్త్రీ విద్య కోసం మలాలా చేస్తున్న కృషికి గుర్తుగా ఆమెకు నోబెల్ శాంతి బహుమతిని అందజేశారు. నోబెల్ బహుమతిని అందుకున్న అతిపిన్న వయస్కురాలిగా ఆమె రికార్డులకెక్కింది. 
 
2015లో యూసుఫ్‌జాయ్ గౌరవార్థం ఒక గ్రహశకలానికి ఆమె పేరు పెట్టారు. 2018లో కార్యకర్త తత్వశాస్త్రం, ఆర్థికశాస్త్రం, రాజకీయాలను అధ్యయనం చేయడానికి ఆమె ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ పాలిసెట్‌ 2022 ఫ‌లితాలు- జూలై 13న విడుదల