Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రపంచం అడ్డుపడినా... అణు పరీక్ష నిర్వహిస్తాం : ఉత్తర కొరియా

ఉత్తర కొరియా మరోమారు గర్జించింది. ప్రపంచం అడ్డుపడినా ఆరో అణు పరీక్ష నిర్వహించి తీరుతామంటూ ప్రపంచ దేశాలకు సవాల్ విసిరింది. అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించే విషయంలో ఎవరు ఏం చెప్పినా ఆలకించబోమని స్పష్టం చేస

ప్రపంచం అడ్డుపడినా... అణు పరీక్ష నిర్వహిస్తాం : ఉత్తర కొరియా
, శనివారం, 2 సెప్టెంబరు 2017 (06:14 IST)
ఉత్తర కొరియా మరోమారు గర్జించింది. ప్రపంచం అడ్డుపడినా ఆరో అణు పరీక్ష నిర్వహించి తీరుతామంటూ ప్రపంచ దేశాలకు సవాల్ విసిరింది. అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించే విషయంలో ఎవరు ఏం చెప్పినా ఆలకించబోమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై ఐక్యరాజ్యసమితిలో ఉత్తర కొరియా ప్రతినిధి మాట్లాడుతూ.. అమెరికా వద్ద ఎన్నో అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని అన్నారు. వాటిపై తామెప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. 
 
అమెరికా రక్షణలో భాగంగా ఆ దేశం అణ్వాయుధాలు తయారు చేసుకుందని, అది ఆ దేశం హక్కు అని ఆయన తెలిపారు. అలాంటి హక్కే తమకు కూడా ఉందని ఆయన అన్నారు. అణ్వాయుధ తయారీ అనేది ఒక దేశ అంతర్గత విషయమని ఆయన స్పష్టం చేశారు. దేశ రక్షణ కోసమే ఏ దేశమైనా అణ్వాయుధాలు తయారు చేసుకుంటుందని ఆయన అన్నారు. 
 
ఉత్తరకొరియాను అమెరికా చుట్టుముట్టి 40,000 మంది సైనికులను మోహరించి, తమ మనుగడను ప్రశ్నార్థకం చేసిందని ఆరోపించారు. దీనిని సహించలేకే తాము అణ్వాయుధ తయారీకి మొగ్గుచూపామన్నారు. ఒక్క బాలిస్టిక్ క్షిపణి పరీక్ష నిర్వహించినంత మాత్రాన అమెరికా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే హద్దు మీరితే అమెరికాతో తలపడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. అందుకే ప్రపంచదేశాలతో తమ సంబంధాలు తెంచి, తమను ఒంటరి చేసినా... అణ్వాయుధాల తయారీ ఆపడం మాత్రం కుదరదని ఆయన తేల్చిచెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దత్తపుత్రిక కాదు.. అపుడు నా భార్య... ఇపుడు డేరా బాబా ఉంపుడుగత్తె