Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యుఎస్‌పై అణు దాడికి సిద్ధమవుతున్న ఉత్తర కొరియా!

అగ్రరాజ్యం అమెరికాపై అణు దాడి చేసేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని యుఎస్ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అమెరికా.. ఉత్తర కొరియా కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు తన అ

Advertiesment
యుఎస్‌పై అణు దాడికి సిద్ధమవుతున్న ఉత్తర కొరియా!
, బుధవారం, 23 ఆగస్టు 2017 (09:49 IST)
అగ్రరాజ్యం అమెరికాపై అణు దాడి చేసేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని యుఎస్ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అమెరికా.. ఉత్తర కొరియా కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు తన అత్యాధునిక యుద్ధ విమానం డ్రాగన్ లేడీని రంగంలోకి దించింది. 
 
ఇదే అంశంపై అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు స్పందిస్తూ ఉత్తరకొరియాది మేకపోతు గాంభీర్యం కాదని, దాని గాండ్రింపులు ప్రమాదకరమైనవని హెచ్చరించారు. అమెరికాను దారుణంగా దెబ్బతీస్తామని ఉత్తరకొరియా ఊరికే అనడం లేదని వారు అంటున్నారు. ఉత్తరకొరియా మొట్టమొదటి సారి 1984లో న్యూక్లియర్ క్షిపణి ప్రయోగం ప్రారంభించిందని, అప్పటి దాని పరిధి, ప్రభావం కూడా చాలా తక్కువని అమెరికా నిఘా విభాగం తెలిపింది. 
 
1990లో రెండోసారి న్యూక్లియర్ క్షిపణి ప్రయోగించిన ఉత్తరకొరియా, ఈ సారి దాని పరిధి, ప్రభావం పెంచిందని తెలిపింది. దీంతో తాము న్యూక్లియర్ దాడుల్లో ఎవరినైనా తలవంచేలా చేయగలమనే ధీమా వచ్చిందని చెప్పింది. తర్వాత సుదీర్ఘ కాలం న్యూక్లియర్ ఆయుధ ప్రయోగాలకు విరామమిచ్చిన ఉత్తరకొరియా 2017 జూలైలో మరోసారి అణుక్షిపణి ప్రయోగాలను మొదలు పెట్టింది. 
 
ఈసారి సరికొత్త టెక్నాలజీ సాయంతో ఈ పరీక్షలు నిర్వహించిందని తెలిపింది. దీంతో కాలిఫోర్నియాను బూడిద చేయగల న్యూక్లియర్ టెక్నాలజీని సొంత చేసుకుందని వారు తెలిపారు. న్యూక్లియర్ ప్రయోగాలకు రాకెట్ ఇంజన్లను అమర్చడం ద్వారా వారి లక్ష్య ఛేధన దూరం పెరిగిందని వారు వెల్లడించారు. అయితే అమెరికాపై అణుదాడికి దిగడం అంటే ఉత్తరకొరియా ఆత్మహత్యకుపాల్పడడం వంటిదని అమెరికా నిఘా విభాగం హెచ్చరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షీనాబోరా మర్డర్ ప్లాన్ విని జడుసుకున్నా: ఇంద్రాణి డ్రైవర్