Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'కిమ్ మాటలతో వినేరకం కాదు'.. ట్రంప్ ట్వీట్ : న్యూక్లియర్ సూపర్‌బాంబ్ టెస్ట్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ట్వీట్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో పాటు ఆ దేశ ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ముఖ్యంగా, కిమ్ మాటలతో వినే రకం కాదు అంటూ ట్రంప్ తాజాగా చ

Advertiesment
'కిమ్ మాటలతో వినేరకం కాదు'.. ట్రంప్ ట్వీట్ : న్యూక్లియర్ సూపర్‌బాంబ్ టెస్ట్
, గురువారం, 31 ఆగస్టు 2017 (12:14 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ట్వీట్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో పాటు ఆ దేశ ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ముఖ్యంగా, కిమ్ మాటలతో వినే రకం కాదు అంటూ ట్రంప్ తాజాగా చేసిన ట్వీట్ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నాయి. అంతటితో అమెరికా అధ్యక్షుడు... న్యూక్లియర్ బాంబును ప్రయోగించినట్టు ప్రకటించారు. 
 
దీంతో అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య యుద్ధ వాతావరణం తగ్గినట్లే తగ్గి మళ్లీ రాజుకున్నట్టయింది. పైగా, నార్త్ కొరియాను లక్ష్యంగా చేసుకుని న్యూక్లియర్‌ సూపర్‌ బాంబ్‌ను పరీక్షించినట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. 'కిమ్‌ మాటలతో వినే రకం' కాదు అంటూ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.
 
మరో వైపు అమెరికా నేవీ కూడా ఓ బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించింది. హవాయిలో ఈ పరీక్షలు నిర్వహించినట్లు పసిఫిక్‌ మిస్సైల్‌ రేంజ్‌ ఫెసిలిటీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, వాయుసేన పరీక్షించిన బీ61-12 బాంబును కిమ్‌ దేశాన్ని అడ్డుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అమెరికా ప్రకటన కిమ్‌ దేశాన్ని ఆందోళనలోకి నెట్టింది. 
 
ఇదిలావుండగా, ఉత్తరకొరియా దూకుడుగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది. గ్వామ్ దీవిని నాశనం చేస్తానని హెచ్చరిస్తూ తాజాగా మధ్యంతర క్షిపణి పరీక్ష నిర్వహించి, దక్షిణ కొరియా, జపాన్‌లను బెంబేలెత్తించిన సంతి తెలిసిందే. ఆ దేశాల ఫిర్యాదుతో ఐక్యరాజ్యసమితి ఉత్తరకొరియాను తీవ్రంగా మందలించింది. 
 
ఉత్తరకొరియాతో ముప్పు పొంచి ఉండడంతో అమెరికా తన ఆయుధగారం నుంచి ఆయుధాలను బయటకు తీస్తోంది. అణుశక్తి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అత్యంత ప్రమాదకరమైన బీ61-12 అనే అణుబాంబును పరీక్షించింది.

నెల్లిస్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఎఫ్-15ఈ విమానం ద్వారా ఈ బాంబును పరీక్షించడం విశేషం. ఇది భయంకరమైన బాంబని, ఇది పేలితే తీవ్రస్థాయిలో విధ్వసం జరుగుతుందని అమెరికా చెబుతోంది. ఇప్పటివరకు అమెరికా తయారు చేసిన అణుబాంబులన్నింటిలో ఇదే అత్యంతశక్తివంతమైన అణుబాంబని తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఛీకొట్టి వెళ్ళిపోయిన భార్యను.. ఆ భర్త ఎలా అక్కున చేర్చుకున్నాడో చూడండి.. (వీడియో)