చైనా బీజింగ్ నగరానికి చెందిన కిమ్ అనే డిజైనర్ మానవ యూరిన్ నుంచి పింగాణీ పాత్రలను తయారు చేసింది. ఆసియాలోనే కళాత్మక వస్తువులను చేతితో తయారు చేయడంలో చైనా దిట్ట.
పలు సంవత్సరాల నుంచే ఆసియా ఖండంలో పింగాణీ పాత్రల తయారీలో చైనా ప్రజలు ముందున్నారు. ప్రారంభంలో బంకమట్టి, సోడా పిండి, బూడిదలతో పింగాణీ పాత్రలను తయారు చేసేవారు.
ఆధునికత పెరిగిన తర్వాత యాక్సైట్‌ను వినియోగించి పింగాణీ పాత్రలను తయారు చేస్తూ వచ్చారు. కానీ సామాజిక కార్యకర్తలు యాక్సైడ్ వంటి ఆమ్లాలతో పింగాణీ పాత్రలు చేయకూడదని పట్టుబట్టారు. తద్వారా పర్యావరణానికి ముప్పు తప్పదని వ్యతిరేకించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కిమ్ ప్రస్తుతం మానవ యూరిన్‌తో పింగాణీ పాత్రలను తయారు చేసింది.
అయితే ఈ పింగాణీ పాత్రలు డైనింగ్ హాలుకు వెళ్లలేవని వట్టి అలంకరణ వస్తువులుగా మాత్రమే ఉపయోగించబడుతాయని కిమ్ వెల్లడించింది. ఈ వస్తువులను లివింగ్ రూమ్‌కే పరిమితం చేయాలని కిమ్ తెలిపింది.
ఐదు నెలల పాటు ఐదుగురి వద్ద సేకరించిన 250 లీటర్ల యూరిన్‌తో ఈ పింగాణీ వస్తువులను తయారు చేసినట్లు కిమ్ చెప్పుకొచ్చింది. ఇంకేముంది.. యూరిన్‌లో కిమ్ పింగాణీల తయారీ ఎలా చేసిందో ఈ వీడియోలో చూడండి.