మూత్రంలో నూనె చుక్క వేసి చూస్తే అంతా తెలుస్తుంది..?

శుక్రవారం, 25 జనవరి 2019 (12:38 IST)
మూత్ర పరీక్ష వలన రోగలక్షణాలను సులువుగా తెలుసుకోవచ్చును. ఉదయం నిద్రలేవగానే మూత్రాన్ని సీసాలో పట్టి సూర్యోదయ కాలంలోనే పరీక్షించుట వలన మంచి ఫలితాలు కలుగుతాయి. మూత్రాన్ని పట్టేటపుడు మధ్య వేగముగల ముత్రాన్ని మాత్రమే సీసాలో పట్టాలి. వాతరోగాలు కలవారిలో మూత్రం నీళ్ళలా కాకుండా, కొంచెం తెల్లగా కనబడుతుంది. కఫరోగాలు కలవారికి మూత్రంలో అధికంగా నురుగు కనబడుతుంది.
 
పిత్తరోగాలు కలవారిలో రక్తవర్ణంగా కనబడుతుంది. మిశ్రమ రంగులు కలిపి ఉంటే.. మిశ్రమ రోగాలు ఉన్నట్లు గుర్తించాలి. పట్టిన మూత్రంలో ఒక చుక్క నూనెను నిదానంగా వేయాలి. అలా వేసినప్పుడు నూనె బిందువు మూత్రం అంతటా చెదిరిపోతే వ్యాధి ప్రారంభ దశలోనున్నట్లు అర్థం చేసుకోవాలి. ఒకవేళ మూత్రంలో నూనె బిందువు ఎటూ వ్యాపించకుండా ఉంటే.. వ్యాధి తీవ్రత అధికంగా ఉందని గుర్తించాలి. నూనె బిందువు మూత్రం లోపలికి మునిగిపోయినచో.. అపాయకర పరిస్థితుల్లో ఉన్నట్లు గ్రహించాలి. 
 
అజీర్ణపు వ్యాధి కలిగిన వారిలో మూత్రం బియ్యం కడుగు నీళ్ళలా పొగరంగు కలిగి ఉంటుంది. వాత, పిత్త వ్యాధులు కలిగి ఉన్నవారిలో.. నీళ్లు మాదిరిగా, పొగరంగు కలిగి వెచ్చగా ఉంటుంది. జ్వరముతోనున్న వారిలో రక్తవర్ణం, పసుపుదనాన్ని కలిగి ఉంటుంది. పరీక్ష నిమిత్తం మూత్రంలో వేయబడిన నూనె చుక్క జల్లెడలా వ్యాపిస్తే.. వారిలో వంశపారంపర్యమైన వ్యాధిగా గుర్తించాలి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం భోజనంలో మొదటి ముద్దను అలా తీసుకుంటే..?