మనకు నిత్యజీవితంలో అత్యంత ఉపయోగకారి, ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు, రోగనిరోధకశక్తి అధికంగా కలిగి ఉంది. దీనిని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. షర్బత్‌లలోను, ఊరగాయలను నిత్యం ఉపయోగిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. పండిన నిమ్మకాయ తోలునుండి తీసె నిమ్మనూనె, నిమ్మరసం బాగా ఉపయోగపడుతాయి. శరీరానికి పుష్టి కలిగించే విటమిన్ ఎ, బి, సి వంటివి పుష్కలంగా లభిస్తాయి.
పౌష్టికాహారమే కాకుండా దీనిని ఇతర ఆహార పదార్థాలలో పిండినప్పుడు కొత్త రుచిని కలిగిస్తుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా నున్నందువలన ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. డిప్తీరియా, టెటానస్ వంటి వ్యాధులను కలిగించే విషక్రిములను నశింపచేస్తుంది. అన్నిరకాల వైరస్‌ల నుండి కాపాడుతుంది.
ప్రతిరోజూ భోజనానికి అరగంటముందు నిమ్మరసం త్రాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. మసూచి, పొంగు, ఆటలమ్మ వంటి వ్యాధులతో మిక్కిలి దప్పికతో బాధపడేవారికి 15 మొదలగు 25 గ్రాముల నిమ్మరసం దప్పికడుతుంది. వాంతులయ్యే వారికి, అజీర్తితో బాధపడేవారికి ఇది ఎంతగానో మేలు చేకూర్చుతుంది. నిమ్మరసం రెండు పూటలా సేవిస్తే చిగుళ్ళ వ్యాధి సోకదు. రక్తవిరేచనాల నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
దీనిని నిత్యం వాడినందువలన ముఖవర్చస్సు, శరీరకాంతి పెరుగుతుంది. ప్రతివారు తమ ఇంట్లో నిమ్మచెట్టు ఉంచుకోవడం మంచిది. అందువలన ఆరోగ్యం సులభంగా మనకందుబాటలో ఉంటుంది. దంత వ్యాధులను నివారిస్తుంది. రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. ఈ నిమ్మ మానవులపాలిటి ఆరోగ్యాన్ని ప్రసాదించే కల్పవృక్షం వంటిది.