Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోడ్డుపై బండి నడుపుతూ వెళ్తున్నారా? డబ్బుల వర్షం కురిస్తే ఎలా వుంటుంది..?

money
, ఆదివారం, 23 అక్టోబరు 2022 (19:26 IST)
money
అలా రోడ్డుపై బండి నడుపుతూ వెళ్తున్నారా? రోడ్లపై డబ్బుల వర్షం కురిస్తే ఎలా వుంటుంది. ఆ సీన్ భలే వుంటుందిగా.. ఇలాంటి సీన్లు సినిమాల్లో చూసి వుంటాం. అయితే నిజ జీవితంలో అలాంటి సందర్భాలు జరగడం తక్కువే. కానీ ఇలాంటి ఘటన నిజ జీవితంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఓ హైవేపై ప్రయాణిస్తున్నవారికి ఈ అనుభవం ఎదురైంది. ఓ కారు నుంచి కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. దాన్నీ చూసినవారంతా ఆ డబ్బును పట్టుకున్నారు. ఏరుకున్నారు. గ్యాంబ్లింగ్ హాల్‌లో దొంగతనం చేసి, పారిపోతున్న దొంగలను పోలీసులు వెంటాడుతుండగా ఈ సంఘటన జరిగింది. చిలీలోని శాంటియాగోలో ఈ ఘటన చోటుచేసుకుంది. పుడహెయెల్‌లో ఓ కేసినోలో బడా బాబులు పెద్ద ఎత్తున జల్సా చేస్తూ ఉంటారు.
 
కొందరు దొంగలు శుక్రవారం సాయంత్రం ఆ కేసినోలోకి ప్రవేశించి, అక్కడున్నవారిని తుపాకీతో బెదిరించి, భారీగా సొమ్మును చేజిక్కించుకుని, తమ కారులో పారిపోయారు. ఈ దొంగలను పోలీసులు పట్టుకునేందుకు వెంటాడారు. ఆ దొంగలు చిలీలోని నార్త్ కోస్టల్ హైవేపైకి పోగలిగారు. 
 
విపరీతమైన వేగంతో కారును నడిపారు. అయినా పోలీసులు వారిని వదిలిపెట్టకుండా వెంటాడుతూనే ఉన్నారు. దీంతో ఆ దొంగలు పోలీసుల దృష్టిని మళ్లించడం కోసం తమ వద్దనున్న డబ్బు కట్టలను రోడ్డుపైన పడేశారు. వారి పన్నాగాలకు పోలీసులు లొంగలేదు. చివరికి ఆ కారును ఆపి, ఆరుగురిని అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టేజీ మీద మాట్లాడుతూ.. కుప్పకూలిన రిటైర్డ్ ప్రొఫెసర్.. గుండెపోటుతో?