Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింహం బోనులోకి వెళ్ళి ఆడుకున్న బాలబాలికలు.. ఏమైందంటే? (video)

సింహం బోనులోకి వెళ్తే ఇంకేమైనా వుందా..? కానీ కొందరు బాలబాలికలు సింహం బోనులోకి వెళ్లారు. ఆపై ఏమైందో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. సౌదీ అరేబియాలోని జెడ్డా స్ర్పింగ్ ఫెస్టివల్‌ ఘనంగా జరిగింది. ఈ

సింహం బోనులోకి వెళ్ళి ఆడుకున్న బాలబాలికలు.. ఏమైందంటే? (video)
, శనివారం, 10 మార్చి 2018 (09:17 IST)
సింహం బోనులోకి వెళ్తే ఇంకేమైనా వుందా..? కానీ కొందరు బాలబాలికలు సింహం బోనులోకి వెళ్లారు. ఆపై ఏమైందో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. సౌదీ అరేబియాలోని జెడ్డా స్ర్పింగ్ ఫెస్టివల్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఓ మచ్చిక చేసుకున్న సింహం బోనులోకి బాలబాలికలను పంపారు.

ఆరునెలల వయసుకే దాదాపు 200 కిలోలు పెరిగిపోయిన ఆ సింహం బోనులోకి వెళ్ళిన బాలబాలికలు ఆడుకుంటుండగా ఓ బాలికపై సింహం దాడి చేసింది.
 
ఈ భయానక ఘటనలో సింహం చేతిలో దాడికి గురైన బాలిక స్వల్ప గాయాలతో బయటపడింది. పిల్లలు కేరింతలు కొడుతూ, సింహం చుట్టూ తిరుగుతూ, దాన్ని పరిగెత్తించారు. కానీ ఉన్నట్టుండి ఓ బాలికపై సింహం దాడి చేసింది. 
 
బాలికను కిందపడేసి తలను నోటిలోకి తీసుకోబోయింది. దీంతో ట్రైనర్ కలుగజేసుకుని.. ఆ బాలికను సింహం బారి నుంచి కాపాడారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సింహం బోనులోకి చిన్నారులను ఎలా పంపుతారని మండిపడుతున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీకే మా మద్దతు.. మోదీ హోదా ఇస్తారు: వైకాపా ఎంపీ విజయసాయి