Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పేలిన స్మార్ట్ ఫోన్.. బ్యాగుకు మంటలు.. వీడియో వైరల్

Advertiesment
పేలిన స్మార్ట్ ఫోన్.. బ్యాగుకు మంటలు.. వీడియో వైరల్
, గురువారం, 22 ఏప్రియల్ 2021 (14:43 IST)
ఛార్జర్లు వున్నప్పుడు ఫోన్లు పేలడం చూసేవుంటాం. మాట్లాడుతున్న సమయంలో.. అకస్మాత్తుగా పేలుతున్నాయి. వీటివల్ల ప్రాణనష్టం కూడా సంభవిస్తుంటుంది. చైనాలో తాజాగా ఓ ఘటన జరిగింది.

రద్దీగా ఉన్న ఓ వీధిలో ఓ వ్యక్తి.. యువతితో కలిసి నడుస్తున్నాడు. అతని చేతికి ఓ బ్యాగ్ ఉంది. నడుస్తూ వస్తుండగా.. బ్యాగ్‌లో ఉన్న ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో బ్యాగ్‌కు మంటలు అంటుకున్నాయి. 
 
అతను వేసుకున్న టీ షర్ట్‌కు మంటలు అంటకముందే.. ఆ బ్యాగ్‌ను కింద పడేశాడు. అక్కడున్న జనం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్టు బుధవారం దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
 
51 సెకన్ల గల ఈ వీడియో వైరల్‌గా మారింది. అసలు ఫోన్ ఎలా పేలిందబ్బా.. అంటూ కొశ్చెన్స్ వేస్తున్నారు. పేలిన సెల్ ఫోన్ శాంసంగ్ కంపెనీదని, 2016లో దీనిని అతను కొనుగోలు చేసినట్లు, చాలా రోజుల నుంచి బ్యాటరీతో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగాల్ ఎన్నికల తర్వాత పెట్రోల్ భారీ వడ్డన.. లీటరుకు రూ.3 వరకు పెంపు