Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో భారత సంతతికి చెందిన వనితా గుప్తా రికార్డ్..!

Advertiesment
US Senate
, గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:39 IST)
Vanita Gupta
భారత సంతతికి చెందిన వనితా గుప్తా అమెరికాలో చరిత్ర సృష్టించారు. అమెరికా అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా నియామకమయ్యారు. ఈ పదవి చేపట్టనున్న శ్వేతజాతియేతర, తొలి భారత సంతతి మహిళగా నిలిచారు. అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా నియామకాన్ని ధ్రువీకరించేందుకు యూఎస్‌ సెనేట్‌లో ఓటింగ్‌ నిర్వహించగా 51 ఓట్లు సాధించారు.
 
వందమంది సభ్యులున్న సెనేట్‌లో రిపబ్లికన్‌, డెమొక్రాట్‌ పార్టీలకు చెరో 50 మంది సభ్యులున్నారు. టై అయితే ఓటు వేసేందుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ సైతం ఓటింగ్‌కు హాజరయ్యారు. న్యాయవిభాగ నామినీగా వనితను అధ్యక్షుడు బైడెన్‌ వనితను ఎంపిక చేశారు.
 
ఈ మేరకు సెనెట్‌లో ఓటింగ్‌ జరగ్గా.. రిపబ్లికన్ నేత, సెనెటర్ లీసా మర్కోస్కీ మద్దతు పలకగా 51-49 స్వల్ప ఆధిక్యంతో వనిత విజయం సాధించారు. అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా విజయం సాధించినందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభినందనలు తెలిపారు. 
 
వనిత మొదట ఎన్‍ఏఏసీపీ లీగల్‍ డిఫెన్స్ ఫండ్‍లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత అమెరికన్‍ సివిల్‍ లిబర్టీస్‍ యూనియన్‍లో విధులు నిర్వర్తించారు. అనంతరం ఒరాక్‍ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో న్యాయ శాఖలోని పౌర హక్కుల విభాగానికి నాయకత్వం వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరల్డ్ ఎర్త్ డే: మనిషికి ఇదే చివరి శతాబ్దమా? డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా?